Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (6-9-16)..!


1. ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ లవ్‌స్టోరీ 'నిర్మలా కాన్వెంట్‌' - కింగ్‌ నాగార్జున

Advertisement
CJ Advs

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ 'నిర్మలా కాన్వెంట్‌'. ఈ చిత్రంలో నాగార్జున ఓ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 8న ఆడియో విడుదల కార్యక్రమం జరుపుకోనుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం వినాయకచవితి సందర్భంగా కింగ్‌ నాగార్జున పాత్రికేయుల సమావేశంలో సినిమా విశేషాలను వెల్లడించారు.... 

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ప్యూర్‌ లవ్‌స్టోరీస్‌ వచ్చి చాలా కాలమైంది. మా బ్యానర్‌లో వస్తున్న నిర్మలాకాన్వెంట్‌ ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ లవ్‌స్టోరీ. కథ వినగానే నాకు బాగా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిన లవ్‌స్టోరీ. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలో కనపడతాను. ఇంటర్వెల్‌ నుండి ఎండింగ్‌ సీన్‌ వరకు నా పాత్ర ఉంటుంది. హీరో శ్రీకాంత్‌తో ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం నుండి మంచి రిలేషన్‌ ఉంది. ఎవరైనా యంగ్‌ హీరోను సినిమాలో తీసుకోవాలనుకున్నప్పుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఫోటోలు చూసి తనైతే ఈ పాత్రకు యాప్ట్‌ అవుతాడనిపించింది. రోషన్‌ నటనను చూస్తే తనకిది మొదటి సినిమాలా అనిపించలేదు. రోషన్‌ శ్రీకాంత్‌ అబ్బాయి అని కాకుండా స్క్రీన్‌ టెస్ట్‌ చేసి సెలక్ట్‌ చేశాం. తన సెట్‌ కాకుండా ఉండుంటే మరో యువ హీరో కోసం వెతికేవాళ్ళం. ఈ సినిమా ద్వారా కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌, హీరో ఇలా చాలా మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నాం. ఇందులో నా పాత్ర వివరాలు పూర్తిగా ఇప్పుడే చెప్పలేను. పెద్ద బిజినెస్‌మేన్‌ పాత్రలో కనపడతాను. అలాగే ప్రేమలో హీరో హీరోయిన్స్‌ ప్రేమ గెలవడంలో సపోర్ట్‌ చేసే రోల్‌. అంతే తప్ప నాకంటూ కొత్త లవ్‌ ట్రాక్‌ ఉండదు. ఇక సినిమా కథను కాన్సెప్ట్‌ ఫిలింస్‌ వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా క్యారెక్టర్‌తో కలిపే స్టోరీ నెరేట్‌ చేశారు. ఇన్‌స్పైరింగ్‌ లవ్‌స్టోరీ కావడంతో సినిమా చేయడానికి ఆసక్తి చూపాను. అది కాకుండా ఈ మధ్య కొత్త తరహా పాత్రలు కూడా చేస్తుండటంతో చేయాలని నిర్ణయించుకున్నాను. నేను హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో నా గొంతు బాలేదని అనేవారు. తర్వాత సెట్‌ అయ్యిందనుకోండి అలాంటప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రోషన్‌ వచ్చి పాట పాడమని తొలిసారి అడిగినప్పుడు ఎందుకు పాడకుండా ఉంటాను. అందుకే ఒప్పుకున్నాను. ఇదే పాటను ఎ.ఆర్‌.రెహమాన్‌గారి తనయుడు అమీన్‌ ఈ పాట పాడటం విశేషం. భవిష్యత్‌లో కూడా సులభంగా ఉండే పాట ఇస్తే పాడే అవకాశం ఉండొచ్చు. సెప్టెంబర్‌ 8న ఈ సినిమా ఆడియో విడుదల చేసి సినిమాను అనుకున్న సమయంలో సెన్సార్‌ పూర్తయితే సెప్టెంబర్‌ 16న విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాం. ఇక నేను ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ చిత్రంలో బిజీగా ఉన్నాను. రాఘవేంద్రరావుగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కీరవాణిగారు ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ అందించారు. అన్నీ అంశాలు అనుకున్నట్లు పూర్తయితే సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయి. ముందుగానే రిలీజ్‌ డేట్‌ చెప్పి తర్వాత వెనక్కు వెళ్ళడం నాకిష్టం ఉండదు. కల్యాణ్‌కృష్ణతో నేను సోగ్గాడే చిన్ని నాయనా చేస్తున్నప్పుడే నాగచైతన్య, కల్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో సినిమా చేయాలనే ఆలోచన ఉంది. చాలా మంచి కథ కుదిరింది. నాకు నిన్నే పెళ్ళాడతా సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చైతు, కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ఆ స్టయిల్లో ఉంటుంది కానీ దానికి రీమేక్‌ కాదు. ఇక అఖిల్‌ విషయానికి వస్తే తనకి మొదటి సినిమా అనుకున్నంత సక్సెస్‌ కాలేదు. దాని వల్ల తను బాగా డిస్ట్రబ్‌ అయ్యాడు. కానీ దాని వల్ల తనకు ఇంకా పట్టుదల పెరిగింది. నెక్ట్స్‌ సినిమా విషయంలో తొందపడవద్దని ముందే చెప్పాను. తను కూడా ఓపిగ్గా వెయిట్‌ చేశాడు. ఇప్పుడు నాకు ఇష్టమైన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా సినిమా చేయబోతున్నాం. ఎందుకంటే నాన్నగారు, నేను, చైతన్య, అఖిల్‌ కలిసి యాక్ట్‌ చేసిన 'మనం' వంటి క్లాసికల్‌ సినిమాను డైరెక్ట్‌ చేశాడు. మనం సినిమాను డైరెక్ట్‌ చేసేటప్పుడే ఓ లవ్‌స్టోరీని చెప్పాడు. నాకు బాగా నచ్చింది కానీ తర్వాత తను నాకు దొరకనంత బిజీ అయ్యాడు. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాడు. రెండు వారాలు గ్యాప్‌ తర్వాత విక్రమ్‌ కుమార్‌ సినిమా వర్క్‌ స్టార్ట్‌ అవుతుంది. మంచి కథ కుదిరింది. సినిమా దాదాపు నవంబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. రెండు సినిమా కథలు చాలా బాగా వచ్చాయి. అన్నపూర్ణ టీం చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్‌ చేస్తున్నాం. ఇక నేను కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో చేయబోయే బంగార్రాజు సినిమా వచ్చే సంవత్సరం చేసే అవకాశం ఉంది... అన్నారు. 

హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ....మా అబ్బాయి రోషన్‌ చదువు పూర్తయిన తర్వాతే తనను సినిమాల్లోకి నటింప చేయాలని అనుకున్నాం. అయితే ముందు రుద్రమదేవి సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. సరే చిన్న పాత్రే కదా చేయని, తనకు కూడా ఓ ఎక్స్‌పీరియెన్స్‌ ఉంటుందని నేను సరేనన్నాను. తర్వాత ఓ రోజు జి.కె.గారు వచ్చి ఈ కథను వినిపించారు. నాగార్జునగారు నిర్మాత అని చెప్పగానే మంచి అవకాశం కదా అనిపించి..ఒకరోజు సమయం అడిగి చెబుతానని అన్నాను. నా కుటుంబ సభ్యులతో డిస్కస్‌ చేశాను. మా అబ్బాయి రోషన్‌ కూడా నాగార్జునగారు నిర్మాత అయితే బావుంటుంది, నేను యాక్ట్‌ చేస్తానని అనడంతో నేను కూడా సరే అన్నాను. ఇక నాగార్జునగారితో ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం నుండి శిరిడీ సాయి వరకు మంచి అనుబంధం ఉంది. ఆయన సెట్‌లో నటీనటులకు ఎంత స్పేస్‌ ఇస్తారో నాకు తెలుసు. ఆయన నిర్మాతగా చేసిన ఈ చిత్రం ద్వారా మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. నిర్మలా కాన్వెంట్‌ తనకు లైఫ్‌లో గుర్తుండే పోయే చిత్రమవుతుంది. అలాగే సినిమాటోగ్రాఫర్‌, మ్యూజిక్‌ ఇలా కొత్తవారు చాలా మంది పరిచయం అవుతున్నారు...అన్నారు. 

నిమ్మగడ్డ ప్రసాద్‌ మాట్లాడుతూ - నిర్మాతగా నా తొలి చిత్రమిది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చేస్తున్నప్పుడు జి.కె తో పరిచయం అయ్యింది. ప్రేమ, నాలెడ్జ్‌ కలిసుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే చిత్రమిది. అనుకున్న ప్లానింగ్‌ ప్రకారమే ఈ సినిమా పూర్తి చేశాం. అందరూ ఎంజాయ్‌ చేసే చిత్రమవుతుంది... అన్నారు. 

ఈ కార్యక్రమంలో థియేట్రికల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్‌, లక్ష్మీనారాయణ ఫిలింస్‌ అధినేత కౌశిక్‌ రెడ్డి పాల్గొని దర్శక నిర్మాతలకు థాంక్స్‌ చెప్పారు. 

2. చైతన్య అక్కినేని 'ప్రేమమ్' లోని 'బ్యాంగ్ బ్యాంగ్' పాట ఈ నెల 8 న విడుదల-ఆడియో సెప్టెంబర్  20-అక్టోబర్ 7 న దసరా కానుకగా చిత్రం విడుదల 

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం 'ప్రేమమ్'. 

ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ...ఈ చిత్రం లో 'బ్యాంగ్ బ్యాంగ్' అంటూ సాగే మరో గీతం ను ఈ నెల 8న విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తెలిపారు. 

ఈ చిత్రం లోని ఒక పాటను  ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన  విషయం విదితమే. ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది. 

అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న 'ప్రేమమ్' ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము.

'దసరా' కానుకగా అక్టోబర్  7న 'ప్రేమమ్'

ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న  'దసరా పండుగ' కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.  

3. రవితేజ హీరోగా విక్రమ్ సిరి దర్శకత్వంలో వల్లభనేని వంశీమోహన్ సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాతగా సినిమా

'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసు గుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. ఎన్టీఆర్ తో 'అదుర్స్' నిర్మించిన శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'రేసు గుర్రం' చిత్రాలకు స్ర్కీన్ ప్లే రచయితగా వ్యవహరించిన విక్రమ్ సిరి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నారు విక్రమ్ సిరి.

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. 

త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ - రవితేజ హీరోగా మా సంస్థలో ఇది మొదటి సినిమా. మంచి కథ కుదిరింది. వక్కంతం వంశీ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ స్టోరీ తయారు చేశారు. శాసన సభ్యుడైన వల్లభనేని వంశీతో కలిసి ఈ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తేలియజేస్తాం... అని చెప్పారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లి రాజేష్.

4. మరో 'ఆపరేషన్ దుర్యోధన' ఈ 'మెంటల్' - బ‌షీద్ 

శ్రీకాంత్, అక్ష నాయ‌కానాయిక‌లుగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘మెంటల్’. ఈ సినిమాని ఎస్‌.కె.బ‌షీద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.కె.క‌రీమున్నీసా నిర్మిస్తున్నారు. ఈనెల 9న దాదాపు 300 థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ థియేట‌ర్‌లో చిత్ర‌యూనిట్ మాట్లాడింది. 

స‌మ‌ర్ప‌కుడు బ‌షీద్ మాట్లాడుతూ -ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌, ఖ‌డ్గం సినిమాల త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజు సినిమా ఇది. శ్రీ‌కాంత్ న‌ట‌న సినిమాకే హైలైట్‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌లో ఎమోష‌న్స్‌ని మించిన ఎమోష‌న్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రాన్ని దాదాపు 300 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తాను. అన్ని ప్ర‌ధాన థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యేలా ప్ర‌య‌త్నం చేస్తున్నా. నేను శ్రీ‌కాంత్ అన్న‌కు పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా. మెంట‌ల్ ఈ సీజ‌న్‌కే సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ అవుతుంది. నైజాం, ఏపీలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం..అన్నారు. 

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ -ఈ సినిమా మరో 'ఆపరేషన్ దుర్యోధన' అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవ‌లే అవుట్ పుట్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అలాగే సాయి కార్తిక్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా మాకోసం ఈ సినిమాకి ప‌నిచేసి మంచి సంగీతాన్ని అందించాడు. దర్శక నిర్మాతలందరూ ఈ సినిమా కోసం చాల కష్టపడ్డారు. వారందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని చిత్రాలు వ‌స్తాయి. ఏపీ, తెలంగాణ‌లో భారీ ఎత్తున ఈ చిత్రం రిలీజ‌వుతోంది. స‌మ‌ర్ప‌కుడు బ‌షీద్‌, నిర్మాత క‌రీమున్నీసా అంద‌రికీ పెద్ద హిట్ ద‌క్కాలి...అని అన్నారు. 

ఈటీవీ ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ -శ్రీ‌కాంత్ అన్న‌తో క‌లిసి ఇది నా రెండో సినిమా. ఇందులో ఓ ప‌వ‌ర్‌ఫుల్ కాప్ పాత్ర‌లో శ్రీ‌కాంత్ అద‌ర‌గొట్టేశారు. సినిమా మైండ్ బ్లోవింగ్‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌, ఖ‌డ్గంని మించిన సినిమా అవుతుంది. మీ ఆశీస్సులు కావాలి... అన్నారు. 

ద‌ర్శ‌కుడు బాబ్జీ మాట్లాడుతూ-ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఎమోష‌న్స్‌ని మించిన ఎమోష‌న్స్ ఈ చిత్రంలో ఉంటాయి. చాలా స‌న్నివేశాల్లో శ్రీ‌కాంత్ న‌ట‌న‌కు క్లాప్స్ ప‌డ‌తాయి. అవ‌కాశం ఇచ్చిన నా నిర్మాత‌ల‌కు థాంక్స్‌...అన్నారు. 300 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న బ‌షీద్ ఈ సినిమాతో పెద్ద విజ‌యం అందుకోవాల‌ని అతిధులు ఆకాంక్షించారు. 

సుహాసిని, నిఖిత, రచన మౌర్య, ముమైత్ ఖాన్, పోసాని, కోట, బ్రహ్మానందం మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం : సాయి కార్తీక్, ఎడిటింగ్ : కోటగిరి, ఫైట్స్ : రవి, కెమెరా : బుజ్జి, నిర్మాతలు : వి.వి.ఎస్.ఎన్.వి ప్రసాద్ దాసరి, వి.వి. దుర్గాప్రసాద్ అనగాని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కారణం బాబ్జి  

5. త్వరలో ప్రారంభం కానున్న అనంతలక్ష్మి క్రియేషన్స్‌ 'ప్రొడక్షన్‌ నెం.1' 

రైతుగా, అన్నదాతగా, రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా విజయకేతనం ఎగరవేసి విద్యాదానం గొప్పదనే సంకల్పంతో విద్యాదాతగా, అనంతలక్ష్మి పేరుతో ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఛైర్మన్‌ అనంతరాముడు తొలిసారిగా చిత్రరంగ ప్రవేశం చేయడం విశేషం. అనంతలక్ష్మి క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించి తొలి చిత్రంగా అత్యున్నత సాంకేతిక విలువలు గల భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు రమేష్‌నాయుడు నిర్మాతగా జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

నాటక రంగంలో ఎంతో అనుభవం గడించి, రాణించి వేల నాటకాలు ప్రదర్శించి ఎన్నో అవార్డులు స్వీకరించిన డి.వై.రఘురామ్‌ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి పోలూర్‌ ఘటికాచలం కథ, మాటలతో పాటు సంగీతాన్ని అందిస్తున్నారు. 

నూతన హీరోహీరోయిన్లు నటించే ఈ సినిమాలో సీనియర్‌ నటులు నటించబోతున్నారు. త్వరలో సాంగ్స్‌ రికార్డింగ్‌ స్టార్ట్‌ చేసి అక్టోబర్‌ ఫస్ట్‌వీక్‌లో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బిక్కీ కృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి.వై.రఘురామ్‌, కథ, మాటలు-సంగీతం: పోలూర్‌ ఘటికాచలం, సమర్పణ: ముళ్ళగూరు లక్ష్మీదేవి, నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌ నాయుడు, స్కీన్‌ప్లే-దర్శకత్వం: జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs