Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (4-9-16)..!


ధ్రువ-నక్షత్రం

Advertisement
CJ Advs

 నక్షత్రం తొలి పది ప్రచారచిత్రాలను విడుదల చేయనున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

నక్షత్రం: ఈ చిత్రం  ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రం తొలి పది ప్రచార చిత్రాలను మరికొద్ది రోజులలో విడుదల చేయనున్నారు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయాన్ని మీడియాతో పంచుకుంటున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. నక్షత్రం లోగో,  ప్రచార చిత్రాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

పోలీస్ అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ నక్షత్రం అని తెలిపారు దర్శకుడు కృష్ణ వంశీ. 

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ  దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై  ప్రొడ్యూసర్ కే.శ్రీనివాసులు విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తునారీ నక్షత్రం చిత్రాన్ని. 

title="Vaishakam Movie Press Meet" href="/gallery-thumbs/29027/4/0/1/vaishakam-movie-press-meet.html">చిన్ని చిత్రాల్లో మా వైశాఖం ట్రెండ్ క్రియేట్ చేస్తుంది - నిర్మాత బి.ఎ.రాజు

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్‌ చిత్రాల తర్వాతలేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో సూపర్‌హిట్‌ అధినేత బి.ఎ.రాజు, ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వైశాఖం. హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్‌లో  చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సందర్బంగా ఆదివారం చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

డైన‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ జయ.బి మాట్లాడుతూ- వైశాఖంసినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ప్రాముఖ్యత ఉంది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. సాంగ్స్ చిత్రీకరించే సమయంలో కజికిస్తాన్ లోని అక్కడి లోకల్ ప్రజలు తమకు తాముగా పాటలు వింటూ డ్యాన్సులు చేసేవారు. అక్క‌డి వారికే అంత క‌నెక్ట్ అవుతుందంటే మ‌న ప్రేక్ష‌కుల‌కు కచ్చితంగా క‌నెక్ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. హీరో హరీష్, హీరోయిన్ సహా అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు.  వసంత్ గారు అంత మంచి మ్యూజిక్ అందించారు. పాటల చిత్రీకరణను చూసిన ఆయన చాలా థ్రిల్ గా ఫీలయ్యారు. రెండు రోజులు మినహా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. అల్రెడి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కలరింగ్ జరుగుతుంది. వైశాఖం టైటిల్ విన్న అందరూ చాలా మంచి ఫీల్ కు లోనవుతున్నారు. రేపు సినిమా చూసిన తర్వాత కూడా అదే అనుభూతికి లోనవుతారు అన్నారు.

చిత్ర నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెలలోచివరి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేస్తాం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తాం. మా బ్యానర్ లో గతంలో విడుదలైన చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ సినిమాల తరహాలో ఈ చిత్రంలో లవ్, ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రం వైశాఖం. మా బ్యానర్ లో విడుదలైన చిత్రాలన్నీ డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. మా సినిమాను తమిళం, హిందీలో విడుదల చేయాలని అందరూ అడుగుతున్నారు. కొత్త కథ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే మా వైశాఖం చిత్రంలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. చిన్న చిత్రాల్లో మా వైశాఖం చిత్రం కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంది అన్నారు.

హీరో హరీష్ మాట్లాడుతూ- బి.ఎ.రాజుగారికి, జ‌య‌గారికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. సినిమా బాగా వచ్చింది. వైశాఖం చిత్రం ఇంత బాగా రావడానికి కారణం జయగారు, రాజుగారే కారణం.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది అన్నారు.

కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ-  ఆర్.జె.సినిమాస్ బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి. అలాగే ఇప్పుడు రానున్న వైశాఖం చిత్రం కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ. నిర్మాత రాజుగారు సినిమాకు సంబంధించిన అన్నీ విషయాలను వెంటనే సమకూరుస్తున్నారు. వసంత్ గారి సంగీతం, సుబ్బారావుగారి సినిమాటోగ్రపీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ- సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. జయగారు ఎడిటింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. సినిమాను నవంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

డి.జె.వసంత్ మాట్లాడుతూ - అందరూ ఇష్టపడి, కష్టపడి చేస్తున్న చిత్రం. లవ్, ఎంటర్ టైన్మెంట్, మెసేజ్ ఉన్న చిత్రం. నవంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ శివ,సుదర్శన్, భద్రమ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

>మంచు ల‌క్ష్మిని క‌ల‌వాలి.. అదే నా చివ‌రి కోరిక‌!

మేము సైతం బుల్లితెరపై ఎంత‌టి సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సామాజిక కార్య‌క్ర‌మంతో ఆప‌న్నుల‌ను ఆదుకునేందుకునేందుకు మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు మ‌న స్టార్లు. సామాన్యులు, క‌ష్టాల్లో ఉన్న‌వారికి మేముసైతం ఊపిరి పోస్తోంద‌న‌డంలో సందేహ‌మే లేదు. ఇలాంటి గొప్ప కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. సామాన్యుల గోడు బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించ‌డంలో హోస్ట్ రెస్పాన్సిబిలిటీ అనిత‌ర సాధ్య‌మైన‌ది. ఆ బాధ్య‌త‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించ‌డంలో ల‌క్ష్మి గొప్ప‌త‌నాన్ని కీర్తించ‌నివారు లేరు. అయితే ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం ఇన్‌స్ప‌యిర్ చేసిందో ఏమో ..  మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న‌ను చూడాల‌ని ఉంది.. అదే నా చివ‌రి కోరిక‌.. అంటూ మ‌ర‌ణానికి చేరువ‌లో ఉన్న క్యాన్స‌ర్ పేషెంట్ మాన‌స (34) డాక్ట‌రును అడిగారుట‌ .. ప్ర‌స్తుతం ఈ వార్త ఫిలింస‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్. మృత్యువు కౌగిలో చివ‌రి అంకంలో ఉన్న ఓ పేషెంట్ ఇలా చూడాల‌నుకోవ‌డం  మెచ్చ‌ద‌గ్గ‌ విష‌యం. మాన‌స కోరిక‌ను మ‌న్నించి ఈరోజు ఉద‌య‌మే మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న‌, న‌టుడు ర‌ఘుబాబు  స్ప‌ర్శ్‌  (హీలింగ్ సెంట‌ర్‌) స్వ‌చ్ఛంద సంస్థలో ఉన్న త‌న‌ని చూసేందుకు వెళ్లారు. 

చివ‌రి కోరిక‌గా .. మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న‌ను చూడాల‌ని మాన‌స అడిగార‌ని డాక్ట‌రు నాకు ఫోన్ చేశారు. వెంట‌నే ల‌క్ష్మి ప్ర‌స‌న్న గారికి ఈ విష‌యం తెలియ‌జేశాను. త‌ను వెంట‌నే ఆ పేషెంట్‌ని చూడాల‌ని అన్నారు. మానస గ‌తంలో టీచ‌ర్‌గా ప‌నిచేశారు. క్యాన్స‌ర్ చివ‌రి ద‌శ‌లో ఉంది. మ‌రో మూడు నెల‌ల్లో చ‌నిపోతార‌ని డాక్ట‌ర్లు చెప్పారుట‌. స్ప‌ర్శ్‌లో చివ‌రి రోజుల్ని గ‌డుపుతున్నారు... ఆమెను ఇలా క‌ల‌వ‌డం .. భావానికంద‌ని ఉద్వేగం నింపింది. అర్థ‌గంట పైగానే మంచు ల‌క్ష్మిగారు, నేను త‌న‌తో గ‌డిపాం .. మ‌న ద్వారా మంచి జ‌రిగితే అంత‌కంటే ఇంకేం కావాలి.... అందుకే ఇలా వెళ్లి క‌లిశాం అని ర‌ఘుబాబు చెప్పారు.

title="Rail Movie Audio Launch" href="/gallery-thumbs/29023/4/0/1/rail-movie-audio-launch.html">టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ చేతుల‌మీదుగా రైల్‌ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ హీరోగా, నేను శైలజ ఫేం కీర్తి సురేష్‌ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్ రైల్‌. ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌ పతాకాలపై బేబి రోహిత రాజ్ఞ‌ సమర్పణలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేమ‌ఖైదీ, గ‌జ‌రాజు చిత్రాల ద‌ర్శ‌కుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.సెప్టెంబర్‌ 16న సినిమా రిలీజ్ కానుంది. డి.ఇమామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజైంది. తొలి సీడీని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆవిష్క‌రించి చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌కి అందించారు. శ‌నివారం సాయంత్రం హైదరాబాద్‌లో జ‌రిగిన ఆడియో వేడుక‌లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి, సి.క‌ళ్యాణ్‌, త‌మిళ వెర్ష‌న్ నిర్మాత త్యాగ‌రాజ‌న్‌, సుకుమార్‌, విక్ర‌మ్ ప్ర‌భు, బెల్లంకొండ సురేష్‌, క‌బాలి తెలుగు నిర్మాత కె.బి.చౌద‌రి, చంటి అడ్డాల‌, సంతోషం సురేష్ కొండేటి, సంగీత ద‌ర్శ‌కుడు డి.ఇమామ్‌, వెన్నెల‌కంటి, కీర్తి సురేష్‌, ఆర్‌.కె.గౌడ్‌, రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, నందు, హ‌రీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం .. 

ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ- రైలు ప్ర‌యాణం ఇష్టం. మా ఊర‌న్నా ఇష్టం. ఊరెళ్లాలంటే రైల్‌లోనే వెళ్లాలి. అలా వెళ్ల‌డ‌మే ఇష్టం. గోదావ‌రి ఇష్టం. అందులో ఈత కొట్ట‌డం ఇష్టం. మా ఊరు కుర్రాళ్లు (ఆది, ఆదిత్య‌, వినోద్‌) ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వారికి సినిమా అంటే ఎంథుసియాసిజం. రైల్ టైటిల్ బావుంది. ఆ సౌండే బావుంటుంది. ఆ మూవ్‌మెంట్ బావుంటుంది. రైలుతో విప‌రీత‌మైన అటాచ్‌మెంట్ అందుకే. ఆ ఇష్టంతోనే ఎగిరే పావుర‌మా చిత్రాన్ని రైలు బ్యాక్‌డ్రాప్‌లో తీశాను. రైల్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాల‌న్నీ హిట్టే. ఈ సినిమా కూడా ఆ కోవ‌లోనే హిట్ట‌వుతుంది. ధ‌నుష్ మ‌న ప‌క్కింట‌బ్బాయిలా ఉంటాడు. మా వూరి కుర్రాళ్ల ప్ర‌య‌త్నం స‌క్సెస‌వ్వాలి అన్నారు. 

సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ -ట్రైల‌ర్స్ సూపర్భ్‌గా ఉన్నాయి. త్యాగ‌రాజ‌న్ ఏ సినిమా చేసినా క‌మిట్‌మెంట్‌తో చేస్తారు. ఈ సినిమా స్క్రిప్టు ద‌శ నుంచి తెలుసు. మంచి హిట్ సినిమా ఇది. ఈ రైల్ బుల్లెట్ ట్రెయిన్ కావాలి. ప్ర‌భుసాల్మ‌న్ చాలా డీటెయిల్డ్‌గా సినిమా తీసే ద‌ర్శ‌కుడు. అత‌డు బుక్‌స్టాల్ కాదు బ్రెయిన్ స్టాల్‌. ధ‌నుష్ గొప్ప క‌థానాయ‌కుడు. కీర్తి సురేష్ మ‌ల‌యాళ ఎంట్రీ సినిమా ప్ర‌మోష‌న్‌కి నేను వెళ్లాను. త‌ను చ‌క్క‌ని న‌టి. నిర్మాత‌లు మంచి సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. బాగా డ‌బ్బులొచ్చే సినిమా ఇది. పెద్ద స‌క్సెస‌వ్వాలి అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ- నేను మంచి సినిమాలు చూడ‌ను.  చూస్తే వాటినుంచి నేనూ తీయాల్సొస్తుంద‌ని. అయితే ఓ గ్రామీణ నేప‌థ్యం ఉన్న సినిమా తీయాల‌ని అనుకున్న‌ప్పుడు కొన్ని త‌మిళ చిత్రాలు చూశాను. అందులో మైనా సినిమా చూశాను. వాస్త‌వానికి మ‌ణిర‌త్నం స‌ర్ సినిమాలంటే ఇష్టం. కానీ ప్ర‌భు సాల్మ‌న్ సినిమాలు చూశాక బెస్ట్ స్క్రీన్‌రైట‌ర్ అనిపించింది. ఇండియ‌న్ సినిమా ప్ర‌పంచంలో వేరే ఏ సినిమాకి తీసిపోని సినిమా అని చెప్పాల‌నుంది. ఆ స్థాయి సినిమా తీశారు ప్ర‌భు. నిర్మాత త్యాగ‌రాజ‌న్ గురించి అంతా బాగా చెబుతున్నారు. ఇంత‌కుముందే త‌మిళ్‌లో కొన్ని మ్యూజిక‌ల్ హిట్ సాంగ్స్ విన్నా. ఆ మ్యూజిక్ కొట్టింది ఇమాన్ అనే విన్నా. పాట‌లు బావున్నాయి. తెలుగు నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్‌  అన్నారు. 

త‌మిళ వెర్ష‌న్ తొడ‌రి నిర్మాత త్యాగ‌రాజ‌న్ (స‌త్య‌జ్యోతి ఫిలింస్ అధినేత‌) మాట్లాడుతూ - బాషా సినిమా త‌ర్వాత చాలా కాలానికి తెలుగులో మా సంస్థ నుంచి సినిమా వ‌స్తోంది. నేను ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌కి అభిమానిని. మైనా, గుంకీ వంటి క్లాసిక్స్ న‌చ్చ‌డం వ‌ల్ల‌నే అత‌డితో ఈ సినిమా (తొడ‌రి) తీశాను. తెలుగులో రైల్ టైటిల్‌తో రిలీజ‌వుతోంది. స్క్రిప్టు న‌చ్చి ధ‌నుష్ ఈ సినిమా చేశారు. ప్ర‌భుసాల్మ‌న్ వ‌ర్కింగ్ స్టైల్ బావుంటుంది. ఇమాన్ సంగీతం పెద్ద ప్ల‌స్. తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌ మాట్లాడుతూ-ప్రేమ‌ఖైదీ, గ‌జ‌రాజు చిత్రాల నుంచి తెలుగువారికి సుప‌రిచిత‌మే. సినిమాకి భాష లేదు. తెలుగు సినిమాలెన్నో చూస్తుంటాను. ధ‌నుష్ జ్వ‌రం వ‌ల్ల ఆడియో వేడుక‌కు రాలేక‌పోయారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో రైల్ ఎపిసోడ్స్‌లో రిస్కీ షాట్స్‌లో ఎంతో క‌ష్ట‌మైనా చేశారు. డిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చే రైల్లో న‌డిచే క‌థ ఇది. ఇమామ్ రైల్ శ‌బ్ధాల్ని కాప్చుర్ చేసి సంగీతం అందించ‌డం గ్రేట్‌. అవ‌కాశం ఇచ్చిన త్యాగ‌రాజ‌న్ గారికి రుణ‌ప‌డి ఉంటాను అన్నారు. 

నిర్మాతల్లో ఒక‌రైన ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ - భాషా సినిమా త‌ర్వాత స‌త్య‌జ్యోతి ఫిలింస్ త్యాగ‌రాజ‌న్‌గారు తెలుగు విడుద‌ల చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను న‌చ్చితే చూడ‌మ‌ని ఒక‌రికైనా చెప్పండి. న‌చ్చ‌క‌పోతే చూడొద్ద‌ని వంద‌మందికి చెప్పండి. సినిమా అంత బాగా వచ్చింది.  . ఈనెల 16న సినిమా రిలీజ్ చేస్తున్నాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌ అన్నారు. 

చంటి అడ్డాల మాట్లాడుతూ- ఏ రైలు అయినా ఏదో ఒక ప్లాట్‌ఫాం వ‌ద్ద స్టార్ట్ అవ్వాలి. ఈ నిర్మాత‌లు ఈ ప్లాట్‌ఫాంతో స‌క్సెసై మ‌రిన్ని సినిమాలు తీయాలి అన్నారు. 

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ- రైలు ప్ర‌యాణం అంటే చాలా ఇష్టం. ఆద్యంతం ఆస్వాధిస్తూ ప్ర‌యాణించ‌డం నాకు అల‌వాటు. రైల్ ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. ర‌న్నింగ్ ట్రెయిన్‌పై అంత అద్భుత‌మైన విజువ‌ల్స్ తీయ‌డం గ్రేట్‌. సినిమా పెద్ద హిట్ట‌వ్వాలి అన్నారు. 

సురేష్ కొండేటి మాట్లాడుతూ- అన్ని జ‌ర్నీల కంటే ట్రెయిన్ జ‌ర్నీ సేఫ్‌, సౌక‌ర్యం అని న‌మ్ముతాను. సికింద‌రాబాద్ నుంచి రైలెక్కి అమ్మా నాన్న‌ల్ని చూసేందుకు వెళ‌తాను. సినిమాల డిస్ట్రిబ్యూష‌న్ రంగం నుంచి వ‌చ్చిన నిర్మాత‌లు .. సేఫ్ ప్రాజెక్టుతో లాంచ్ అవుతున్నారు. ఆడియో రిలీజ్‌కి ముందే లాభాలార్జించిన సినిమా కూడా ఇది. పోటీలో కొనుక్కున్నారు. వ‌డ్డే రామానుజం వ‌ల్ల‌నే ఈ ప్రాజెక్టు వారికి ఓకే అయ్యింది. నేను శైల‌జ ఫేం కీర్తి సురేష్ హ‌త్తుకుపోయే పెర్ఫామ‌ర్‌. బాషా నిర్మాత‌లు త్యాగ‌రాజ‌న్ నిర్మించిన ఈ సినిమా తెలుగులోనూ పెద్ద  విజ‌యం సాధిస్తుంది`` అన్నారు. 

డి.ఇమాన్ మాట్లాడుతూ- మైనా, గుంకీ... ఈ వ‌రుస‌లోనే రైల్ సినిమాకి ప్ర‌భుగారితో క‌లిసి ప‌నిచేశాను. ఈ సినిమా మీ అంచ‌నాల్ని చేరుకునే సినిమా అన్నారు. 

వెన్నెల కంటి మాట్లాడుతూ- బాషా నుంచి త్యాగ‌రాజ‌న్ గారితో అనుబంధం ఉంది. వారి సంస్థ‌లోని మొద‌టి సినిమా బాషాకి, రెండో తెలుగు సినిమా రైల్‌కి నేనే ర‌చ‌యిత‌ను. ఈ సినిమాలో సౌతిండియాలోనే బెస్ట్ లొకేష‌న్స్‌ని చూపించారు. ఇష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. ప్ర‌భుతో గ‌త సినిమాల‌కు ప‌నిచేశాను. పెద్ద విజయం సాధించే చిత్ర‌మిది అన్నారు. 

>ప్రారంభమైన ప్రణయం

శ్రీ విజయానంద్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎ. నరేందర్‌, విజయానంద్‌, సురేష్‌గౌడ్‌ నిర్మాతలుగా జి.ఎస్‌.వి. సత్యప్రసాద్‌ దర్శకత్వంలో దిలీప్‌(నూతన పరిచయం), పూనమ్‌ కౌర్‌, అక్షిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ప్రణయం. ఈ చిత్రం హైద్రాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు గుణ్ణం గంగరాజు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, నిర్మాత సి. కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. నటుడు రఘబాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...ముందుగా మా టీమ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు జి.ఎస్‌.వి. సత్యప్రసాద్‌ మంచి కథ వినిపించడంతో వెంటనే చిత్రాన్ని నిర్మించేందుకు మేము సిద్ధమయ్యాము. ఈ చిత్రం ద్వారా దిలీప్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం.. వినాయకచవితి పండుగ అనంతరం షూట

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs