3. 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే' ప్లాటినమ్ డిస్క్ వేడుక
పి.ఆర్. మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న సినిమా 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'. పవన్, గట్టు మను హీరోలుగా నటించారు. సోనియా దీప్తి హీరోయిన్. షకలక శంకర్, తాగుబోతు రమేశ్, బాషా, షానీ, పింగ్ పాంగ్, చిట్టిబాబు, చంద్రమౌళి, శ్రీనివాస్ కీలక పాత్రధారులు. సోనీ పవన్, గట్టు రజిని నిర్మాతలు. సంతోష్ నేలంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. సాగర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్, రామకృష్ణ గౌడ్, శివాజీరాజా, భోలే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..టైటిల్ చాలా బావుంది. ట్రైలర్ కూడా నచ్చింది. హీరోలు చక్కగా చేశారు. సోనియా ఇప్పటికే నాలుగు హిట్లు ఇచ్చిన అమ్మాయి. తన గోల్డెన్ లెగ్ ఈ సినిమాకు ఉపయోగపడుతుంది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే మాటలో వాస్తవం సగమే ఉంది. చిన్న సినిమాల కోసం నేను కూడా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాను. చిన్న చిత్రాల వల్ల చాలా మంది బతుకుతారు... అని అన్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ...1970 నుంచి నల్గొండలో థియేటర్ ఉన్న కుటుంబం గట్టు కుటుంబం. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూస్తే సినిమాలో కొత్తదనం ఉందనిపిస్తోంది. కొత్తవారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది... అని చెప్పారు. సాగర్ మాట్లాడుతూ...రొటీన్ పిక్చర్‌లాగా లేదు. కాన్సెప్ట్ బావుంటే ఇప్పుడు అన్ని చిత్రాలూ ఆడుతున్నాయి. ఇది కూడా తప్పకుండా పెద్ద సినిమా అవుతుంది... అని అన్నారు. సోనియా మాట్లాడుతూ...ఇందులో మంచి పాట పాడాను. ఇకపై కూడా అవకాశం వస్తే తప్పకుండా పాడుతాను... అని చెప్పారు. శివాజీరాజా మాట్లాడుతూ...చిన్న చిత్రాలు లేకపోతే 24 క్రాఫ్ట్ లకు కష్టమవుతుంది. విడుదల సమయంలో ఎవరూ కంగారు పడొద్దు. తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకోసం థియేటర్లను కేటాయిస్తోంది. హీరో కరెంట్ తీగలాగా సన్నగా ఉన్నాడు. పవర్ ఉన్న కుర్రాడు.. అని అన్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ...సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. సోనియా పాడిన పాట బావుంది... అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ....ఫీల్ గుడ్ చిత్రమిది. యువతకు కావాల్సిన మసాలా కూడా ఉంటుంది. 2016లో విడుదలై విజయం సాధించిన చిత్రాల్లో మా సినిమా కూడా ఉంటుందనే నమ్మకం ఉంది... అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ...మా అబ్బాయికి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అతని కోసం నిర్మాతగా మారాను. 1973 నుంచి మాకు నల్గొండలో థియేటర్ ఉంది. అతిథులు అందరూ మాట్లాడిన మాటలు వింటుంటే దాదాపు 150 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తామనే నమ్మకం కుదిరింది... అని అన్నారు. హీరో మాట్లాడుతూ....మా పాటలకు మంచి స్పందన వచ్చింది. గత వారం రోజుల్లోనే మూడున్నర లక్షల క్లిక్కులు యూట్యూబ్‌లో పడ్డాయి... అని అన్నారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ....సినిమా బాగా వచ్చింది. సంగీతం చక్కగా కుదిరింది. పాటల కార్యక్రమం చేయడం ఆనందంగా ఉంది.. అని చెప్పారు.
4. పరుచూరి వెంకటేశ్వరరావు రిలీజ్ చేసిన .'ఆమె... అతడైతే.' ఫస్ట్‌లుక్
ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ హనీష్ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆమె.. అతడైతే'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని స్టార్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు.
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - 'ఆమె అతడైతే' టైటిల్ చాలా డిఫరెంట్‌గా వుంది. డైరెక్టర్ సూర్యనారాయణ చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. పోస్టర్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వున్నాయి. దర్శకుడు ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని విన్నాను. టైటిల్ ఎంత క్యూరియాసిటీగా వుందో.. సినిమా కూడా అదేవిధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను తేవాలని కోరుకుంటూ దర్శకుడు సూర్యనారాయణకి మంచి బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను...అన్నారు.
దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ - తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ కుర్రాడు కలెక్టర్ కావాలని కలలు కన్న తన తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నెరవేర్చాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. తన లక్ష్యం కోసం సిటీకి వచ్చిన ఆ కుర్రాడు, తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే డిఫరెంట్ పాయింట్‌తో ఫుల్‌లెంగ్త్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. డిఫరెంట్ టైటిల్‌తో కథకి యాప్ట్ అయ్యేవిధంగా ఈ సినిమా వుంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా నిర్మాతలు మారుతీ ప్రసాద్, రాధాకృష్ణలు ఈ చిత్రాన్ని ఎంతో క్వాలిటీతో నిర్మించారు. క్లాసికల్ డ్యాన్సర్‌గా ఇంటర్నేషనల్ లెవల్‌లో గుర్తింపు పొందిన హనీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. హనీష్ ఫెంటాస్టిక్‌గా నటించాడు. కన్నడలో ఉపేంద్ర, సుదీప్ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. యశో కృష్ణ కథకి తగ్గట్లుగా మంచి మ్యూజిక్‌ని అందించాడు. సుద్దాల అశోక్‌తేజ ఎక్స్‌లెంట్‌గా పాటల్ని రాశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ సూపర్. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ అయి దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను...అన్నారు.
నిర్మాతలు ఎం.మారుతీప్రసాద్, ఎన్.రాధాకృష్ణ మాట్లాడుతూ - ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో దర్శకుడు సూర్యనారాయణ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం వుంటుంది. పరుచూరి వెంకటేశ్వరరావుగారు మా చిత్రం ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా వుంది. యశోకృష్ణ సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో ఆడియో రిలీజ్ చేసి అదే నెలాఖరులో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం..అన్నారు.