మిల్కీ `స్పెషల్` రేటెంతో తెలుసా?
ఐటెమ్ అనగానే ఆమడ దూరం పారిపోయిన కథానాయికలు ఇప్పుడు మాత్రం మేం చేస్తాం, మేం చేస్తాం అంటూ ఎగబడుతున్నారు. అందుకు కారణం ఆ పాటల్ని పరిశ్రమ, ప్రేక్షకులు చూసే కోణం మారడంతోపాటు... అడిగినంత పారితోషికం దక్కుతుండడమే. ఇదివరకు ఐటెమ్ పాట చేసిందంటే ఇక ఆ హీరోయిన్ పనైపోయినట్టే అనుకొనేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. దాన్ని కూడా ఓ క్రేజ్ కిందే పరిగణిస్తున్నారు. పైపెచ్చు నాలుగైదు రోజులు చేస్తే అయిపోయే ఆ పాటకోసం దాదాపుగా ఓ మొత్తం సినిమా స్థాయిలో పారితోషికం లభిస్తోంది. అందుకే కథానాయికలంతా ఐటెమ్ అంటూ అర్రులు చాస్తున్నారు. తాజాగా తమన్నా ఐటెమ్ పాటకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అల్లుడుశీను మొదలుకొని ఇప్పటికే రెండు మూడు చిత్రాల్లో స్పెషల్ అందాలు ఆరబోసింది. త్వరలోనే చిరు సినిమాలో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతోందని ప్రచారం సాగుతోంది. ఇంతలో `జాగ్వార్` ప్రకటన వచ్చింది. జాగ్వార్‌లో మిల్కీ గ్లామర్ మెరుపులే హైలెట్ కాబోతున్నాయట. ఆ పాట కోసం ఆమె అక్షరాలా రూ: 50 లక్షలు పుచ్చుకొంటున్నట్టు సమాచారం. మొదట ఈ పాట కోసం శ్రుతిహాసన్‌ని సంప్రదించారట. కానీ ఆమె కోటి రూపాయలు కోట్ చేసిందట. దీంతో తమన్నాని సంప్రదించారట. ఆమె అరకోటికే ఓకే చెప్పడంతో అవకాశం ఆమెకే దక్కిందని సమాచారం.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads