పెళ్లయినా ముద్దులతో వేడిపుట్టిస్తోంది..!
ఐశ్వర్యారాయ్ అంటే ఓ అందాల దేవత. ఆమె తెరపై చేసిన మాయ అంతా ఇంతా కాదు. అందుకే ఐష్ పెళ్లి చేసుకొంటోందని తెలియగానే ఎంతోమంది కుర్రకారు మూగగా రోధించారు. అంతటి అందాన్ని దూరమైపోతున్నామే అని. కానీ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకి తల్లయ్యాక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఐష్. దాంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. అయితే మునుపటిలా కనిపిస్తుందా? తన అందంతో ఇదివరకటిలాగా రెచ్చగొడుతుందా? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాంటి డౌట్లున్నవాల్లందరికీ తాను ఏమాత్రం డోసు తగ్గించలేదనే ఓ సంకేతాన్ని పంపిస్తోందామె. `ఏ దిల్ హై ముష్కిల్` ట్రైలరే అందుకు ఓ ఉదాహరణ. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై సంచలనం రేపింది. అందుకు ప్రధాన కారణం రణబీర్ కపూర్‌ని ఐశ్వర్య రాయ్ లిప్ లాక్ చేయడమే. పెళ్లైనా సరే, వేడి పుట్టింగలనని నిరూపిస్తూ ఆమె రణ్‌బీర్ కపూర్‌తో ఘాటైన ముద్దు సన్నివేశాలు చేసింది. తనకంటే వయసులో చిన్నవాడే అయినా రణబీర్ తో కెమిస్ట్రీ అదిరిపోయేలా పండించింది. దీంతో ఆ సినిమాపై అందరి దృష్టీ పడింది. మళ్లీ ఐశ్వర్య హవా మొదలవుతోందని మాట్లాడుకొంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
Show comments