1. అపార్ట్‌మెంట్ పాటలు విడుదల
శ్రీ క్రియేటివ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె. శ్రీకాంత్ అంగళ్ళ నిర్మించిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్ చిత్రం 'అపార్ట్‌మెంట్'. సంగీత దర్శకుడు ఖుద్దూస్ ఎస్.ఎ. సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియోని ప్రముఖ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ మరియు దర్శకుడైన ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'పాటలు విన్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఖుద్ధూస్ గురించి నాకు బాగా తెలుసు. బాగా కష్టపడతాడు. ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను.' అని అన్నారు.
దర్శకుడు శివగంగరాజు వుడిమూడి మాట్లాడుతూ..ఒక అపార్ట్‌మెంట్ కల్చర్‌లోకి ఎంటరైన ఒక అమ్మాయి..అక్కడ ఎలాంటి అనుభవాలను ఫేస్ చేసింది అనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ఇది నా మొదటి సినిమా. నిర్మాతకు ఋణపడి ఉంటాను. అలాగే సంగీత దర్శకుడు మంచి పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చాడు..తప్పకుండా ఈ చిత్రం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను..అన్నారు.
నిర్మాత ఎ.కె. శ్రీకాంత్ అంగళ్ళ మాట్లాడుతూ..దర్శకుడు తొలి చిత్రమే అయినా..చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సహకరించిన నటీనటులకు, టెక్నీషీయన్స్‌కి నా కృతజ్ఞతలు. ఖుద్ధూస్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. సినిమా బాగా వచ్చింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది..అని అన్నారు.
సంగీత దర్శకుడు ఖుద్దూస్ మాట్లాడుతూ..ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకి నా ధన్యవాదాలు. ఈ సినిమా ద్వారా నాకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.
నిఖిత, సంజన, చిన్నా, ఉత్తేజ్, విజయ్‌సాయి, రక్ష, అల్లరి సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఖుద్దూస్ ఎస్.ఎ., కెమెరా: సాబూ జేమ్స్, ఎడిటర్: నాగిరెడ్డి, ప్రొడ్యూసర్: ఎ.కె. శ్రీకాంత్ అంగళ్ళ, కథ-దర్శకత్వం: శివగంగరాజు వుడిమూడి.
2. విజువల్ వండర్ 'శరభ'లో నిఖిత ఐటెం సాంగ్...
ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్ గా వర్క్ చేసిన ఎన్.నరసింహరావ్ దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'శరభ'. జయప్రద, నెపోలియన్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో హ్యుమన్ ఏమోషన్స్ తో పాటు హై టెక్నికల్ వాల్యూస్ తో విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కోటి మ్యూజిక్ డైరెక్షన్ కంపోజ్ చేసిన మాస్ బీట్ లో నిఖిత నర్తించనుంది. బాబా భాస్కర్ సినిమాకు నృత్య రీతులను సమకూరుస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో జరగుతున్న ఈ సాంగ్ లో 50 మంది డ్యాన్సర్స్, 300 జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్నారు. క్వాలిటీ, మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అన్ కాంప్రమైజ్డ్ గా సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ తెలియజేశారు. సినిమా చాలా బాగా వస్తుంది. అన్నీ వర్గాలను అలరించే మంచి సినిమా అవుతుందని దర్శకుడు ఎన్.నరసింహారావ్ అన్నారు.
ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, జయప్రద, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి,రఘుబాబు, జబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్,ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు.
3. సెప్టెంబర్ 4న నేచురల్ స్టార్ నాని 'మజ్ను' ఆడియో
నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మజ్ను'. ఈ చిత్రానికి సంబంధించి 'కళ్ళు మూసి తెరిచే లోపే.. గుండెలోకే చేరావే..' అంటూ సాగే మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా, 'ఓయ్.. మేఘమాల..' అంటూ సాగే రెండో పాటను రెడ్ ఎఫ్.ఎం. ద్వారా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4న లహరి మ్యూజిక్ ద్వారా 'మజ్ను' ఆడియో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని, ఇమ్మానుయేల్, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్ మాదిరాజ్, కేవశదీప్, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్., సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: విరించి వర్మ.
4. మలయాళ రీమేక్‌లో అల్లరి నరేష్
తమిళ్ పడం రీమేక్‌గా తెలుగులో రూపొందిన సుడిగాడు చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ మరోసారి ఓ సెన్సేషనల్ రీమేక్‌లో నటించబోతున్నాడు. మలయాళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలో నరేష్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మలయాళ చిత్ర రీమేక్ హక్కుల్నీ ఫ్యాన్సీ రేట్‌తో సొంతం చేసుకున్నారు జాహ్నవి ఫిలింస్ అధినేత బొప్పన చంద్రశేఖర్. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ తెలుగు రీమేక్‌కు అలా ఎలా చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న అనీష్ కృష్ణ దర్శకుడు. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బొప్పన చంద్రశేఖర్ తెలియజేస్తూ.. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది. ఇది నరేష్ కెరీర్‌లో వైవిద్యమైన కమర్షియల్ చిత్రంగా నిలిచిపోతుంది.ఎంటర్‌టైన్‌మెంట్, హ్యుమన్ ఎమోషన్స్‌తో పాటు నేటి యువతరం నచ్చే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా వున్నాయి. గమ్యం తర్వాత నరేష్ నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ చిత్రమిది. మలయాళంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: డి. జె. వసంత్, సమర్పణ: శ్రీమతి నీలిమ.
5. 'త్రివిక్రమన్' ప్రచార చిత్రం విడుదల !!
'త్రివిక్రమపాండ్యన్' అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన ఒక బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా రూపొందిన చిత్రం 'త్రివిక్రమన్'. అమీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన ఈ చిత్రానికి తోటకూర రామకృష్ణారావు సహ నిర్మాత. కస్తూరి శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. లేడి మ్యూజిక్ డైరెక్టర్ రుంకీ గోస్వామి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బోలె రీ రికార్డింగ్ అందించారు. డిస్కో శాంతి సోదరి సుచిత్ర ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. రవిబాబు, నాగబాబు, 'ఈరోజుల్లో' ఫేమ్ శ్రీ, ధన్ రాజ్, ప్రవీణ్ రెడ్డి, అమూల్యారెడ్డి, షాలిని ముఖ్య తారాగణంగా.. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణరాజు 'త్రివిక్రమన్' ట్రైలర్ రిలీజ్ చేశారు. విశిష్ట అతిధిగా హాజరైన శేకూరి ధర్మశాస్త్ర పీఠాధిపతి గుంతుపల్లి శ్రీనివాసరావు 'త్రివిక్రమన్' టైటిల్ లోగోను ఆవిష్కరించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చినబాబు, విశ్వ తదితరులతోపాటు 'త్రివిక్రమన్' యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వినూత్నమైన కథ-కథనాలతో.. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన 'త్రివిక్రమన్' టైటిల్ లోగో, మరియు ట్రైలర్ చాలా బాగున్నాయని, సినిమా ఘన విజయం సాధించి, దర్శకనిర్మాత క్రాంతికుమార్ ఉజ్వలమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. ఈ చిత్రం వీలైనన్ని ఎక్కువ ధియేటర్స్ లో విడుదలయ్యేందుకు తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దర్శకనిర్మాత క్రాంతికుమార్ మాట్లాడుతూ.. సహ నిర్మాత తోటకూర రామకృష్ణారావు, తన మిత్రుడు ప్రవీణ్ రెడ్డి, ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన కస్తూరి శ్రీనివాస్ ల సహాయ సహకారాల వల్లే.. సినిమా తీయాలనే తన కల సాకారమయ్యిందని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, చినబాబుల ప్రోత్సాహాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని.. అన్నారు. కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులు 'త్రివిక్రమన్' చిత్రానికి తప్పకుండా మంచి విజయం అందిస్తారనే నమ్మకం తనకుందని ఆయన పేర్కొన్నారు. చిత్ర నిర్మాణంలో తనకు సహాయ సహకారాలు అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిధుల చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు.
డిస్కో సుచిత్ర, సన, సహదేశ్ పాండే, చంటి, సత్తెన్న తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: చెరుకు బత్తుల, రచనా సహకారం: టి.హర్షవర్ధన్, సినిమాటోగ్రఫీ: నాగార్జున-సునీల్-బాబు, ఎడిటింగ్: సునీల్ మహారాణా, రీ రికార్డింగ్: బోలె, సంగీతం: రుంకీ గోస్వామి, కో-ప్రొడ్యూసర్: తోటకూర రామకృష్ణారావు, దర్శకత్వ పర్యవేక్షణ: కస్తూరి శ్రీనివాస్, నిర్మాణం-దర్శకత్వం: క్రాంతికుమార్ !!
6. హిందీ చిత్రం తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన హీరో దీపక్
తెలుగు లో సంపంగి, నీ తోడు కావాలి, కనులు మూసినా నీవాయే, ప్రేమలో పావని కళ్యాణ్, అరుంధతి, భద్ర, కింగ్,మిత్రుడు వంటి విజయవంత మైన చిత్రాలలో నటించిన హీరో దీపక్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. విషయానికొస్తే....హిందీ లో గురు, ప్యాషన్ వంటి భారీ చిత్రాలలో నటించిన దీపక్ ఇటీవల విడుదల అయిన 'రుస్తుం' లో అక్షయ్ కుమార్ , ఇలియానా లతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ లో హిట్ అయ్యి రెండు వారాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రం లో దీపక్ నటనకు మీడియా నుండి క్రిటిక్స్ నుండి అభినందనలు లభించాయి.
ఈ సందర్భంగా హీరో దీపక్ మాట్లాడుతూ - నా సినీజీవితం ప్రారంభమైంది ఇక్కడే, దర్శక నిర్మాత సానా యాది రెడ్డి గారు నన్ను పరిచయం చేసిన తొలి చిత్రం 'సంపంగి' మొదటి చిత్రం తోనే తెలుగు ప్రేక్షకులు ఆదరించారు ఆశీర్వదించారు అందుకు మీ కందరికి కృతజ్ఞుడను. ఆ తరువాత నేను నటించిన అన్ని చిత్రాలను కూడా అదే విధంగా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నేను నటించిన తెలుగు సినిమాలనే చూసి హిందీ లో కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అందులో భాగం గానే ఇటీవల విడుదల అయిన రుస్తుం లో కూడా నాకు అత్యంత ముఖ్యమైన పాత్ర లభించింది. ఈ చిత్రం రెండు వారాల్లో 100 కోట్ల క్లబ్ లో చేరినందుకు చాలా సంతోషం గా వుంది. అంతే కాకుండా నేను పోషించిన విక్రమ్ క్యారెక్టర్ కి మంచి రివ్యూస్ మీడియా నుండి వచ్చినందుకు ఇంకా ఆనందంగా వుంది. అందుకు నన్ను ప్రోత్సహించిన ప్రేక్షకులకు, దర్శకులకు నిర్మాతలకు రుణపడి వుంటాను. ఈ ఆనందాన్ని నన్ను నటుడిగా గుర్తించిన టాలీవుడ్ ప్రముఖులతో, తెలుగు ప్రేక్షకుల తో పంచుకుందామని ఈ వార్త ద్వారా తెలియచేస్తున్నాను.నన్ను మొదటి నుండి ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాత సానా యాది రెడ్డి గారికి, దిల్ రాజు గారికి, బోయపాటి శ్రీను గారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, శ్రీను వైట్ల గారికి, భీమనేని శ్రీనివాస రావు గారికి ధన్యవాదాలు. హిందీ లో ఎన్ని సినిమాలు చేసిన తెలుగు చిత్రాలలో నటించడమంటే నే నాకు ఇష్టం.తెలుగు లో నటనకు స్కోప్ వున్నా నెగటివ్ రోల్స్ చేయడానికైనా నేను రెడీ...అన్నారు.
7. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'శ్రీరామరక్ష'
వశిష్ఠ సినీ అకాడమీ బ్యానర్‌పై రజిత్, షామిలి, నిషా, విజయ్‌కుమార్, షఫీ, జ్యోతి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, కాశీ విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'శ్రీరామరక్ష'. రాము దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రభాత్ వర్మ నిర్మిస్తున్నారు.
ఒక సాంగ్ మినహా సినిమా టాకీ మొత్తం పూర్తయ్యింది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సామాజిక బాధ్యతను తెలియజేసే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేసి సెప్టెంబర్ లో సినిమా ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు.
ఈ చిత్రానికి మాటలు, సాహిత్యం: పరిమి కేథార్‌నాథ్, మ్యూజిక్: సాబు వర్గీస్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: వైధి, సినిమాటోగ్రఫీ: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, ఫైట్స్: రామ్ సుంకర, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి.రంగరాజు, నిర్మాత: ప్రభాత్ వర్మ, స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.