రజనీతో అల్లుడి సినిమా... ఫిక్స్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఎంత మంచి నటుడో... అంత మంచి నిర్మాత కూడా. వండర్ బార్ ఫిల్మ్స్ పేరుతో ఓ సంస్థని ఏర్పాటు చేసి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ సంస్థ నుంచి సినిమా వస్తోందనగానే అంచనాలు ఆకాశాన్నంటుతుంటాయి. తనదైన టేస్ట్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు ధనుష్. ఇప్పుడు మామ రజనీకాంత్ కథానాయకుడిగా తన నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. ప్రస్తుతం రజనీ రోబో2.0 చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్తవ్వగానే ధనుష్ నిర్మాణంలో సినిమా కోసమే రంగంలోకి దిగుతాడట రజనీ. మామతో అల్లుడు సినిమా నిర్మిస్తుండడం ఒకెత్తైతే, ఆ చిత్రానికి కబాలి ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహిస్తుండడం మరో విశేషం. ధనుష్ ఆ విషయాన్ని టీజర్ రూపంలో ట్విట్టర్‌లో ప్రకటించగానే అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టినంత పని చేశారు. ఇంతకంటే క్రేజీ కాంబినేషన్ మరొకటి ఉండదంటూ మాట్లాడుకొంటున్నారు. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. మరి అది కబాలి2 గా తెరకెక్కుతుందా లేదంటే, వేరొక కొత్త కథతో తెరకెక్కుతుందా అన్నది చూడాలి.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads