Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (28-8-16).!


స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం 'డి.జె...దువ్వాడ జగన్నాథమ్'

Advertisement
CJ Advs

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు  నిర్మాతగా కొత్త చిత్రం 'డి.జె....దువ్వాడ జగన్నాథమ్' సినిమా రూపొందనుంది. ఆర్య, పరుగు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న మూడో చిత్రమిది. అంతే కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న 25వ సినిమా కూడా ఇదే కావడం విశేషం. 

బన్నితో ఆర్య, ఆర్య2, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సహా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆర్య, బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తో రూపొందనున్న డి.జె....దువ్వాడ జగన్నాథమ్  చిత్రం రేపు (ఆగస్ట్ 29) హైదరాబాద్ హదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఉదయం 7గంటల 15 నిమిషాలకు లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

ఓ మంచి పర్పస్‌ఫుల్‌ ఫిలింగా 'ఒక్కడొచ్చాడు'

పందెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్‌ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా ఒక్కడొచ్చాడ. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. అలా ఈ సినిమాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రశ్నించడానికి, వాళ్ళకి న్యాయం చెయ్యడానికి ఒక్కడొచ్చాడు. అదే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో వుండే ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ అన్నీ వుంటూనే ఒక పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ ఫిలింగా ఒక్కడొచ్చాడు రూపొందుతోంది. దర్శకుడు సురాజ్‌ ఈ స్టోరీ లైన్‌ చెప్పగానే ఇమ్మీడియట్‌గా అన్ని సినిమాలూ ఆపి ఇదే ముందు స్టార్ట్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాను. అంతగా ఈ కథకు నేను కనెక్ట్‌ అయ్యాను. ఇందులో ఒక కొత్త పాయింట్‌ వుంది. అది అన్ని ఊళ్ళల్లో అందరూ నిత్యం ఫేస్‌ చేసేదే. ఆ పాయింట్‌ చుట్టూ అల్లిన మంచి కమర్షియల్‌ సినిమా ఇది. ఇందులో నా లుక్‌, క్యారెక్టరైజేషన్‌ ఇంతకుముందు సినిమాలన్నింటి కంటే డిఫరెంట్‌గా వుంటుంది. తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. జగపతిబాబు ఒక ముఖ్యపాత్ర చేస్తున్నారు. తరుణ్‌ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. ఈ బర్త్‌డేకి ఒక్కడొచ్చాడు షూటింగ్‌లో వుండడం నాకు ఎంతో ఆనందంగా వుంది. నామనసుకి నచ్చిన సినిమా షూటింగ్‌లో నా బర్త్‌డే జరుపుకోవడం నిజంగా రియల్‌ హ్యాపీ బర్త్‌డేగా ఫీల్‌ అవుతున్నాను. దీపావళి కానుకగా వచ్చే ఒక్కడొచ్చాడు డెఫినెట్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకొని నా కెరీర్‌లో మరో మంచి హిట్‌ సినిమాగా నిలుస్తుందని నా నమ్మకం. సెప్టెంబర్‌ 12 నుండి మిస్కిన్‌ డైరెక్షన్‌లో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మరో చిత్రం ప్రారంభిస్తున్నాం. ఒక్కడొచ్చాడు తెలుగులో జి.హరి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది' అన్నారు ఆగస్ట్‌ 29 తన బర్త్‌ డే సందర్భంగా ఒక్కడొచ్చాడు సినిమా విశేషాలను తెలియజేస్తూ మాస్‌ హీరో విశాల్‌. 

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ఒక్కడొచ్చాడు ప్రోగ్రెస్‌ గురించి నిర్మాత జి.హరి మాట్లాడుతూ - విశాల్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీ. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, అద్భుతమైన మ్యూజిక్‌లతో పాటు ఆల్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్న చిత్రం ఇది. సెప్టెంబర్‌ 3 నుండి రష్యాలో బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరిస్తాం. విశాల్‌ బర్త్‌డే ఆగస్ట్‌ 29 సందర్భంగా టీజర్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. కోటి 50 లక్షల వ్యయంతో కనల్‌ కణ్ణన్‌ సారధ్యంలో తీసిన ఛేజ్‌ ఈ సినిమాకి ఓ హైలైట్‌. అలాగే విశాల్‌, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో తీసిన పాట స్పెషల్‌ ఎట్రాక్షన్‌. హీరోయిన్‌ తమన్నాకి మరో హీరోయిన్‌ శృతిహాసన్‌ పాట పాడడం మరో విశేషం అన్నారు. 

విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

విష్ణు మంచు సరసన హన్సిక 

దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. 'ఈడోరకం-ఆడోరకం' వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతున్న లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ 'లక్కున్నోడు'. తొలినాళ్ళ నుండి విభిన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న విష్ణు మంచుతో మా ఎం.వి.వి.సినిమా బ్యానర్ లో సినిమా చేయడం ఆనందంగా ఉంది.  ఈడోరకం -ఆడోర‌కం వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత విష్ణు నటిస్తున్న చిత్రమిది. గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుక‌న్న రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణుతో బబ్లీ బ్యూటీ హన్సిక నటిస్తుంది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు మాటలు, స్క్రీన్ ప్లే, పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ, మ‌ధు ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారని చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ తెలిపారు.   

యూత్‌ఫుల్‌గా 'బ‌లపం ప‌ట్టి భామ ఒడిలో'

ర‌ష్మీగౌత‌మ్, శాంత‌న్ జంట‌గా న‌టించిన ఓ త‌మిళ చిత్రం తెలుగులో 'బ‌ల‌పం ప‌ట్టి భామ ఒడిలో' అనే పేరుతో అనువాద‌మైంది. అ ఆ ఇ ఈ అనేది  ఉప‌శీర్షిక‌. దుర్గం గిరీష్ బాబు స‌మ‌ర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజ‌య్ కుమార్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ గ‌జ‌గౌని నిర్మాత‌. ఎ.సి.ముగిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ క‌థ చాలా యూత్‌ఫుల్‌గా సాగుతుంది. యువ‌త‌కు న‌చ్చేలా భార‌తీబాబు మంచి డైలాగులు రాశారు. ర‌ష్మీ గౌత‌మ్‌కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె న‌ట‌న అంద‌రినీ  అల‌రిస్తుంది. అనువాద ప‌నులు పూర్త‌య్యాయి. విజ‌య్ ఎబింజ‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సెప్టెంబ‌ర్ 9న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. 

'స్వామి రారా' కాంబినేషన్లో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం3 ప్రారంభం

నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్న చిత్రం ఈరోజు సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య నిరాడంబరంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్ నామా క్లాప్ ఇవ్వగా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, అభిషేక్ నామా తండ్రి నామా మధుసూదనరావు కెమేరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ - రివెంజ్ డ్రామా స్టోరీ ఇది. నిఖిల్ కొత్త క్యారెక్టర్లో కనిపిస్తాడు. రివెంజ్ డ్రామాలో లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. షూటింగ్ అంతా కాకినాడ నుంచి విశాఖ వరకూ ఉన్న సముద్రతీర ప్రాంతంలో జరుపుతాం అన్నారు. నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ - నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన స్వామి రారా తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇప్పుడీ సినిమా కూడా సరికొత్తగా ఉంటుంది. సుధీర్ వర్మ చాలా మంచి కథ చెప్పాడు. సెప్టెంబర్ 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నిఖిల్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్ కీలక పాత్రలో కనిపిస్తారు. త్వరలో టైటిల్, ఇతర టెక్నీషియన్ల వివరాలు ప్రకటిస్తాం అన్నారు.​

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs