Advertisement
Google Ads BL

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (26-8-16).!


1. జనతా గ్యారేజ్ సెన్సార్ పూర్తి.  సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ 

Advertisement
CJ Advs

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'జనతా గ్యారేజ్' .ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం నేడు హైదరాబాద్ లో పూర్తి అయింది. U/A రేటింగ్ తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో విడుదల అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది.  

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మించాం. చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U/A రేటింగ్ వచ్చింది.  భారీ తారాగణం తో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో ప్రపంచవ్యాప్తం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. మా బ్యానర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలుస్తుంది అని అనుకుంటున్నాం.. అని తెలిపారు. 

2. విశాల్‌ పుట్టిన రోజు సందర్భంగా... ఆగస్ట్‌ 29న 'ఒక్కడొచ్చాడు' టీజర్‌ విడుదల 

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఇటీవల ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ భారీ ఛేజ్‌ని షూట్‌ చేశారు. ఈ ఛేజ్‌ చిత్రానికే ఓ హైలెట్‌ కానుంది. అలాగే నృత్య దర్శకుడు దినేష్‌ నేతృత్వంలో మాస్‌ హీరో విశాల్‌పై ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి హిప్‌ ఆప్‌ తమిళ్‌ సంగీతం అందిస్తున్నారు. 

రష్యాలో సాంగ్స్‌ పిక్చరైజేషన్‌!! 

నిర్మాత జి.హరి మాట్లాడుతూ....విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో 'ఒక్కడొచ్చాడు' చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా వుంది. విశాల్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీ. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, అద్భుతమైన మ్యూజిక్‌లతో పాటు ఆల్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్న చిత్రం ఇది. సెప్టెంబర్‌ 3 నుండి రష్యాలో బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరిస్తాం. విశాల్‌ బర్త్‌డే ఆగస్ట్‌ 29 సందర్భంగా టీజర్‌ని రిలీజ్‌ చేస్తాం. దర్శకుడు సురాజ్‌ టేకింగ్‌ మార్వలెస్‌. డెఫినెట్‌గా తెలుగులో విశాల్‌ రేంజ్‌ని మరింత పెంచే చిత్రం అవుతుంది. అక్టోబర్‌ 9న ఆడియో విడుదల చేసి, దీపావళి సందర్భంగా సినిమా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం...అన్నారు. 

3. నాని హీరోగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ చిత్రం 'మజ్ను' 

రెడ్‌ ఎఫ్‌.ఎం. ద్వారా రెండవ పాట 'ఓయ్‌.. మేఘమాల..' విడుదల 

సూపర్‌హిట్‌ చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా పి.కిరణ్‌ నిర్మాణ సారధ్యంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై 'ఉయ్యాలా జంపాలా' ఫేం విరించివర్మ దర్శకత్వంలో గోళ్ళ గీత నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రానికి సంబంధించి 'కళ్ళు మూసి తెరిచే లోపే.. గుండెలోకే చేరావే..' అంటూ సాగే మొదటి పాటను ఇటీవల రేడియో మిర్చి ద్వారా విడుదల చేశారు. కాగా, 'ఓయ్‌.. మేఘమాల..' అంటూ సాగే రెండో పాటను ఈరోజు రెడ్‌ ఎఫ్‌.ఎం. ద్వారా రిలీజ్‌ చేశారు. 

ఈ చిత్రం ఆడియోను లహరి మ్యూజిక్‌ ద్వారా ఈ వారంలోనే రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. 

4. శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందిన మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన' - సీనియర్‌ నరేష్‌ 

'దృశ్యం' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన'. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ జె. సత్తార్‌ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన '22 ఫిమేల్‌ కొట్టాయం' చిత్రాన్ని సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్‌. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమం ఆగస్ట్‌ 26న హైదరాబాద్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు నరేష్‌, 'సూపర్‌హిట్‌' పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు, చిత్ర నిర్మాత వి.ఆర్‌. కృష్ణ ఎం. పాల్గొన్నారు. సీనియర్‌ నటుడు నరేష్‌ 'ఘటన' ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. 

కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది!! 

సూపర్‌హిట్‌ పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - సన్‌మూన్‌ క్రియేషన్‌ 'ఘటన'.. 'దృశ్యం'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీప్రియ మనకి అందిస్తున్నారు. నిత్యామీనన్‌తో పాటు నరేష్‌, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈనెల 31న ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. 'ఇష్క్‌' ఫేమ్‌ అరవింద్‌ శంకర్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఆడియో పెద్ద హిట్‌ అయ్యింది. దర్శకురాలు శ్రీప్రియ, నిత్యామీనన్‌, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ యూనిట్‌ అంతా ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌లో పాల్గొనబోతున్నారు. వి.ఆర్‌. కృష్ణగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని తీశారు. అప్పట్లో 'ప్రతిఘటన' చిత్రం ఎంత సెన్సేషన్‌ సృష్టించిందో డెఫినెట్‌గా ఈ 'ఘటన' కూడా సెన్సేషనల్‌ హిట్‌ అవుతుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో 'ఘటన' కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది..అన్నారు. 

ఆగస్ట్‌ 31న ప్లాటినవమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌! సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్‌!! 

చిత్ర నిర్మాత వి.ఆర్‌. కృష్ణ ఎం. మాట్లాడుతూ - సన్‌మూన్‌ క్రియేషన్స్‌ బేనర్‌లో తొలిసారిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. 'దృశ్యం'లాంటి అద్భుత చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన శ్రీప్రియగారి డైరెక్షన్‌లో ఈ 'ఘటన' చిత్రాన్ని నిర్మించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన '22 ఫిమేల్‌ కొట్టాయం' చిత్రాన్ని భారీ ఆఫర్‌తో రీమేక్‌ రైట్స్‌ తీసుకుని తెలుగులో 'ఘటన' పేరుతో నిర్మించాం. నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో క్రిష్‌ జె. సత్తార్‌ని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. ఈనెల 31న ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ని చలన చిత్ర ప్రముఖులు, చిత్ర యూనిట్‌ సమక్షంలో చాలా గ్రాండ్‌గా జరపనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం.. అన్నారు. 

నా కెరీర్‌లో మైలురాయిలా నిలిచే చిత్రం!! 

సీనియర్‌ నరేష్‌ మాట్లాడుతూ - గత 2,3 ఏళ్ళుగా చూస్తే తెలుగు సినిమా ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. భిన్నమైన కథ, కథనాలతో కొత్త జోనర్‌ ఫిలింస్‌ వస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొత్త అర్థాన్ని చెప్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన 'పెళ్ళి చూపులు' చిత్రాన్ని కొత్త ఫ్లేవర్‌లో చూపించారు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాల్ని కోరుకుంటున్నారు. ఆ కోవకి చెందిన చిత్రం 'దృశ్యం'. తెలుగు సినిమా చరిత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కొత్త కోణంలో తీసి సూపర్‌హిట్‌ చేయడమే కాకుండా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా 'దృశ్యం' చిత్రాన్ని తీర్చిదిద్దారు శ్రీప్రియ. నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ రోల్‌ 'దృశ్యం'లో చేశాను. మళ్ళీ శ్రీప్రియగారు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి కొత్త ఫ్లేవర్‌ వున్న కథతో 'ఘటన' చిత్రాన్ని రూపొందించారు. వి.ఆర్‌. కృష్ణగారు నిర్మాతగా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. మరో కొత్త క్యారెక్టర్‌లో ఈ చిత్రంలో నటించాను. ఖచ్చితంగా ఈ సినిమా యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతుంది. 'దృశ్యం'లాంటి పెక్యులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం 'ఘటన'. లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో నిత్యామీనన్‌ ది బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేసింది. క్రిష్‌ సత్తార్‌ బ్యూటిఫుల్‌గా నటించాడు. కీ రోల్‌లో నేను ఒక పాత్రలో నటించాను. ప్రధానంగా ఈ సినిమా నిత్యామీనన్‌, క్రిష్‌ సత్తార్‌, నా రోల్‌ ఈ మూడు పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. ఒక కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు శ్రీప్రియ. దాదాపు 150 చిత్రాల్లో నటించాను. ఇలాంటి రోల్‌ నేను ఇంతవరకూ చేయలేదు. ఎవరూ ఊహించనటువంటి ఒక కొత్త క్యారెక్టర్‌ని నేను చేసాను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన శ్రీప్రియగారికి వి.ఆర్‌. కృష్ణగారికి నా ధన్యవాదాలు. సొసైటీలో జరిగే ఒక బర్నింగ్‌ ప్రాబ్లెమ్‌ని తీసుకుని దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి మంచి మ్యూజిక్‌, ఫొటోగ్రఫీతో శ్రీప్రియగారు 'ఘటన' చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు సినిమాకి హిట్‌ చిత్రమే అవ్వడం కాకుండా ఒక గౌరవాన్ని తెచ్చే సినిమాగా నిలుస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. నటుడిగా నాకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందని నా నమ్మకం. మా అమ్మ తర్వాత నాకు నచ్చిన మహిళా దర్శకురాల్లో నాకు నచ్చిన దర్శకురాలు శ్రీప్రియ. ఒక కన్‌విక్షన్‌ నరేష్‌ ఈ పాత్ర చెయ్యాలి అని 'దృశ్యం'లో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. అలాగే ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన కొత్త క్యారెక్టర్‌ని నాతో చేయించారు... అన్నారు. 

5. సునీల్‌ హీరోగా ఎన్‌.శంకర్‌ దర్శక నిర్మాణంలో మహాలక్ష్మి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం.2 సాంగ్స్‌ రికార్డింగ్‌ ప్రారంభం 

మలయాళంలో విజయవంతమైన టు కంట్రీస్‌ చిత్రాన్ని సునీల్‌ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ బ్యానర్‌పై పొడక్షన్‌ నెం.2గా రూపొందిస్తున్నారు. ఎన్‌.శంకర్‌ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా సాంగ్స్‌ రికార్డింగ్‌ కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రారంభమైంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సాంగ్‌ రికార్డింగ్‌ను ప్రారంభించారు. టీ న్యూస్‌ ఎం.డి.సంతోష్‌ కుమార్‌ స్క్రిప్ట్‌ అందించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో... 

హీరో సునీల్‌ మాట్లాడుతూ - మలయాళంలో దిలీప్‌గారు చేసిన సినిమా టు కంట్రీస్‌. ఆయన గతంలో చేసిన సినిమాను తెలుగులో పూలరంగడు పేరుతో రీమేక్‌ చేసి సక్సెస్‌ సాధించాను. ఆయన సినిమాలు అచ్చి రావడంతో ఈ సినిమా చేస్తున్నాను. సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్‌ చేసే ఫుల్‌ ప్లెజ్డ్‌ ఎంటర్‌టైనర్‌. నా స్టయిల్‌లో ఉంటూ సరదాగా సాగే డిఫరెంట్‌ కామెడి సినిమా ఇది. పూలరంగడు సినిమాకు డైలాగ్స్‌ అందించిన శ్రీధర్‌ సీపాన ఈ సినిమాకు డైలాగ్స్‌ రాస్తున్నాడు. అలాగే గోపీసుందర్‌తో తొలిసారి వర్క్‌ చేస్తున్నాను. మ్యూజిక్‌ ఫ్రెష్‌గా ఉంటుంది... అన్నారు. 

గోపీ సుందర్‌ మాట్లాడుతూ -మలయాళ మాతృక టు కంట్రీస్‌కు నేనే మ్యూజిక్‌ అందించాను. ఇప్పుడు సునీల్‌గారు చేస్తున్న తెలుగు రీమేక్‌కు కూడా నేనే మ్యూజిక్‌ అందించడం ఆనందంగా ఉంది. శంకర్‌గారితో వర్క్‌ చేయడం హ్యాపీగా, కంఫర్ట్‌గా ఫీలవుతున్నాను... అన్నారు. 

శ్రీధర్‌ సీపాన మాట్లాడుతూ..గతంలో సునీల్‌గారితో సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌ పూలరంగడు, భీమవరం భుల్లోడు చిత్రాలు చేశాను. ఇప్పుడు ఆయనతో కలిసి చేస్తున్న మూడో సినిమా. ఎన్‌.శంకర్‌గారితో ఫస్ట్‌ టైం వర్క్‌ చేస్తున్నాం. మంచి డైలాగ్స్‌ అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.... అన్నారు. 

దర్శకుడు ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ....మలయాళంలో దాదాపు 55 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసిన టు కంట్రీస్‌ సినిమా బావుందని నా ఫ్రెండ్స్‌ చెప్పడంతో, సినిమా చూశాను. బాగా నచ్చింది. దిలీప్‌గారు సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యి మంచి విజయం సాధించాయి. హీరో సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌కు బాగా సూట్‌ అవుతుందనిపించడంతో ఆయన్ను కూడా సినిమా చూడమని అన్నాను. ఆయన కూడా సినిమా చూసి బావుందన్నారు. ఈ పాత్ర సునీల్‌గారు తప్ప ఎవరూ చేయలేరు. ఈ చిత్రం కామెడి ఎంటర్‌టైన్మెంట్‌ అయినా అన్నీ ఎమోషన్స్‌ ఉంటాయి. నా సినిమాలన్నీ కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌. ఇది యూనివర్సల్‌ మూవీ. అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. ఇళయరాజాగారి తర్వాత అంత మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా గోపీసుందర్‌ కనిపించారు. మాతృతకకు కూడా ఆయనే సంగీతం అందించారు. ఓరిజినల్‌లో కూడా కొన్సి సాంగ్స్‌తో పాటు కొత్త సాంగ్స్‌ కూడా యాడ్‌ చేస్తాం. శ్రీధర్‌సీపాన మంచి డైలాగ్స్‌ రాస్తున్నారు. సెప్టెంబర్‌ నుండి డిసెంబర్‌ వరకు సినిమా షూటింగ్‌ జరుగుతుంది. పదిహేను రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తాం. తర్వాత షెడ్యూల్‌ అవుట్‌ డోర్‌లో ఉంటుంది. 70 శాతం సినిమా అమెరికాలో చిత్రీకరిస్తాం. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో జరిగే సినిమా. అలాగే ఓరిజినల్‌ ప్లేవర్‌ మిస్‌ కాకుండా స్క్రిప్ట్‌ను బెటర్‌ మెంట్‌ చేసి మన నెటివిటీకి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తాం. ఈ ప్రాజెక్ట్‌ రూపకల్పనకు సూత్రధారి రాజారవీంద్ర ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు... అన్నారు. 

ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరాం, టీన్యూస్‌ సి.ఇ.వో.నారాయణరెడ్డి, బి.గోపాల్‌, క్రాంతిమాధవ్‌, సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, కె.అచ్చిరెడ్డి, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలను తెలిపారు. సునీల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: గోపీసుందర్‌, నిర్మాత, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌. 

6. మెదటిషెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఏంజెల్'  

టాలీవుడ్ యంగ్ హీరో నాగ అన్వేష్- హేబా పటేల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ తొలి దశ షూటింగ్ ముగిసింది. 'బాహుబలి' ఫేం పళని డైరెక్షన్ లో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 15 రోజులు పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో నాగ అన్వేష్, హెబ్బాపటేల్, సప్తగిరిల పై రెండు ఫైట్లతో పాటు కీలక సన్నివేశాల్ని చిత్రకరించినట్లుగా దర్శకుడు బాహుబలి పళని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ మొత్తం చాలా అద్భుతంగా వచ్చిందని ఈ సన్నివేశాలు కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయని నిర్మాత భువన్ సాగర్ చెప్పారు. వచ్చే నెలలో గోదావరి జిల్లాల్లో 'ఏంజెల్' తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త తరహా చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తుండగా రష్ చూసిన యూనిట్ సభ్యులు గుణ సినిమాటోగ్రఫీ చూసి అద్భుతమని మెచ్చుకున్నట్లు సమాచారం. హాస్య సన్నివేశాలు బాగా రక్తి కట్టాయని దర్శకుడు బాహుబలి పళని తెలిపారు. హైదరాబాద్ లోని టాంక్ బండ్ బుద్ద విగ్రహం దగ్గర లో వేసిన సెట్ లో చేసిన షూటింగ్ ఈ షేడ్యూల్ మొత్తం హైలెట్ గా నిలిచిందని చిత్ర వర్గాలు తెలిపాయి.​

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs