గ్యాంగ్‌స్టర్ నయీముద్ధీన్ అలియాస్ నయీమ్ డైరీ రాజకీయ నేతలకు, ఆయనతో ఏమాత్రం చిన్నపాటి సెటిల్మెంట్లలో లింకు పెట్టుకున్న అధికారులకు అందరికీ ముచ్చమటలు పోయిస్తుంది. ఆ డైరీ ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిసిందే. ఈ దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు ప్రజలంతా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నయీమ్ ప్రధానంగా తెలుగు దేశం పార్టీలోనూ, తెదేపా నాయకులతోనూ అభిమానంతో అలా పార్టీని నమ్ముకొని ఉన్నాడన్నదే ఇప్పుడు సంచలనం. ఇప్పుడు ఆ నయీమ్ డైరీ ఇతడు అప్పటి రాజకీయనేతలు, అధికారులతో జరిపిన దందాలు, చీకటి వ్యవహారాలన్నీ తెలియజేస్తుంది. అందుకనే ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిగతంగా ఏ నాయకుడికి ఆ నాయకుడు లోలోపల మదనపడుతున్నాడు. నయీమ్ ముందే చాలా తెలివిగా అన్ని విషయాలను కూలంకషంగా, ఆ నేతల లెక్కలతో సహా డైరీలో రాసుకున్నాడు. 'నన్ను టచ్ చేస్తే మీ బండారం భయట పెడతాను' అని బెదిరించి మరీ దందాలు నిర్వహించాడు. కాగా ఇందులో పలువురు కీలక నేతల పేర్లు ఉన్నాయన్నట్లు అందిన రహస్య సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అదే విధంగా నయీమ్ దందాలో పాలు పంచుకున్న నేతలంతా భారీస్థాయిలో ఆస్తులు కూడబెట్టుకున్నారు. వీరిలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేతలుగా ఉన్న తేదేపా, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తర్వాత వాళ్ళంతా నయీమ్ భారి నుంచి తమ్ము తాము కాపాడుకొనేందుకు తేరాసలోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం.
అయితే సిట్ బృందం కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. నల్గొండకు చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారని, ప్రస్తుతం వీరంతా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇంకేముంది దీంతో ఇప్పుడు ఒక్కొక్కరికి కంటిపై కునుకు లేకుండా ఉందని, పరువుపోతుందేమోనని బాగా వత్తిడికి కూడా గురౌతున్నట్లు తెలుస్తుంది. ఒక్కడు చెడ్డ అలవాట్లకు గురైతే, వాడు బలవంతుడై ఉంటే ఆ ఒక్కడు సమాజాన్ని చెడిపేసేటంత ప్రభావాన్ని చూపుతాడు. ఆ ఒక్కడిని తమ స్వప్రయోజనాల కోసం కొంతమంది చెడ్డవాణ్ణిగా మలిస్తే అది చాలా మందిని కలుషితం చేస్తుంది. ఇది నిజం. చెడుపకురా చెడేవి అంటారు కదా మరి.