Advertisement
Google Ads BL

'తిక్క' టైటిల్ అందుకే పెట్టాం!: సాయిధరమ్ తేజ్


మెగా ఫ్యామిలి నుండి  హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ తన రెండో సినిమాతోనే హీరోగా నిరూపించుకున్నాడు. వరుసగా విజయాలు అందుకుంటున్న సాయి ధరమ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'తిక్క'. సునీల్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకం పై రోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 13 న విడుదలకు సిద్ధం అయింది. లారిస్సా బొనెసి, మన్నారా చోప్రాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సందర్బంగా సాయి ధరమ్ తో ఇంటర్వ్యూ ...  

Advertisement
CJ Advs

1. తిక్క సినిమా పై మీ కాన్ఫిడెంట్? 

ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాం. ముఖ్యంగా నా కెరీర్ లో భిన్నమైన సినిమా. ఇప్పటి వరకు పక్కా కమర్షియల్ సినిమాలు చేసిన నేను మొదటి సారి ఓ డిఫరెంట్ సినిమా చేశా. 

2. డిఫెరెంట్ సినిమా అంటున్నారు .. ఇంతకీ కథేంటి?

ఈ కథను నేను 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా తరువాత విన్నా, దర్శకుడు సునీల్ చెప్పిన విధానం బాగా నచ్చింది. ఈ సినిమాలో హీరో ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేస్తుంటాడు. అతని లవ్ బ్రేక్ అప్ అవుతుంది. ఆ బ్రేక్ అప్ పార్టీ తోనే  కథ మొదలవుతుంది. అతని జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ? అన్నదే కథ .. కొత్తగా ఉంటుంది. 

3. తిక్క టైటిల్ పెట్టడానికి కారణం?

ఇదివరకే చెప్పినట్టు ఆ బ్రేక్ అప్ తరువాత అతని జీవితంలో అన్ని సంఘటనలు తిక్క  తిక్క గా జరుగుతాయి. ఆ తిక్క సంఘటనల్లో ఇతను చేసిన తిక్క పనులు ఏమిటి అన్నదే ఈ సినిమా, అందుకనే ఈ  టైటిల్ పెట్టాం.  తిక్క టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా . 

4. దర్శకుడు సునీల్ ఎలా డీల్ చేసాడు?

తను ముందు నుండి ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. పైగా టెక్నీకల్ గా కూడా తనకు మంచి గ్రిప్ ఉంది. అందుకనే ప్రతి విషయంలో అయన ఎంతో కేర్ తో సినిమా చేసాడు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఇక నిర్మాత రోహన్ రెడ్డి కూడా ఎక్కడ , ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.  

5. హీరోయిన్స్ ఇద్దరున్నారు .. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నా?

కాదండి .. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కూడా మొదటి హీరోయిన్ లారిస్సా బొనెసి తో నా లవ్ బ్రేక్ అప్ జరుగుతుంది .. ఆ తరువాత జరిగే కథ ఇది. ఇందులో మన్నారా నన్ను ప్రేమిస్తూ నన్ను ఫాలో అవుతూ ఉంటుంది. 

6. ఇందులో తాగుబోతు సీన్స్ బాగా చేసినట్టున్నారు .. అనుభవం ఉందా?  

(నవ్వుతూ ) లేదండి బాబు .. ఒక్క చుక్క కూడా తాగలేదు .. ఈ సీన్స్ చేయడానికి తాగుబోతు రమేష్ బాగా హెల్ప్ చేసాడు. చిన్న చిన్న టిప్స్ ఇచ్సి ఈ సీన్స్ బాగా రావడంలో తోడ్పడ్డాడు. అలాగే చిరంజీవి, పవన్ మావయ్యల సినిమాలు కూడా చూసాను. 

7. కథలు ఎంచుకునేటప్పుడు  దేనికి ప్రాధాన్యత ఇస్తారు?

నేను ముందు కథకే ప్రాధాన్యత ఇస్తా. కథ వినగానే ఇది మనకు సూట్ అవుతుందా లేదా అనేది అంచనా వేసుకుంటా .. ఆ తరువాత దానిలో ఏవైనా మార్పులు ఉంటె చెబుతా. 

8. ఆకతాయి సినిమా ఎంతవరకు వచ్చింది?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. ఇంకా టైటిల్ పెట్టలేదు. వచ్చే నెలలో షూటింగ్ మొదలు పెడతాం. 

9. కృష్ణవంశీ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు కదా?

అవును.. కృష్ణవంశీ గారు నిజంగా జీనియస్. సినిమా గురించి తనకు చాలా తెలుసు,  ఆయనతో పనిచేయడం  నిజంగా గొప్ప అవకాశం గా భావిస్తాను. తనతో చాలా  రోజులుగా పరిచయం ఉంది. ఒకరోజు కలిసి ఈ నక్షత్రంలో ఓ చిన్న గెస్ట్ పాత్ర ఉంది చేస్తావా అని అడిగారు .. వెంటనే సరే అన్నా. 

10. కళ్యాణ్ రామ్ తో మల్టి స్టారర్ చేస్తున్నారట? మరి మీ మెగా హీరోలతో ఎప్పుడు?

అవును, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అది ఫైనల్ కాలేదు. ఇక మా మెగా హీరోలతో ఎప్పుడైనా నేను రెడీ. కథలు కుదరాలిగా. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs