Advertisement
Google Ads BL

సూపర్‌హిట్‌ ఇవ్వాలనే లక్ష్యంతో చేస్తున్నారంట!


డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రం నాలుగో షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈనెల 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్‌ని, ఓ పాటని చిత్రీకరిస్తారు. రంజాన్‌ శుభాకాంక్షలతో దర్శకనిర్మాతలు ఈ చిత్రం ప్రోగ్రెస్‌ని తెలియజేశారు. 

Advertisement
CJ Advs

సూపర్‌హిట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో.. 

దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ - 'లవ్‌లీ' తర్వాత మళ్ళీ సూపర్‌హిట్‌ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా 'వైశాఖం'. ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి ఎంజాయ్‌ చేసే మంచి సినిమాగా 'వైశాఖం' రూపొందుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌ మిక్స్‌ అయిన 'వైశాఖం' అపార్ట్‌మెంట్స్‌ నేపథ్యంలో సాగుతుంది. డైరెక్టర్‌గా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్‌గా పెద్ద హిట్‌ రేంజ్‌కి వెళ్తుంది. కజక్‌స్థాన్‌లో తీసిన సాంగ్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి'..అన్నారు. 

బిజినెస్‌ క్రేజ్‌ 

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - 'జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ.. ఇవన్నీ హిట్‌ అయి బయ్యర్స్‌కి లాభాల్ని అందించాయి. మళ్ళీ జయ దర్శకత్వం వహిస్తున్న సినిమా అనగానే బయ్యర్స్‌ ఈ సినిమా మీద ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే నిర్మాతగా నా చిత్రాలకు చేసే పబ్లిసిటీ పెద్ద స్థాయిలో వుంటుందన్న నమ్మకంతో బిజినెస్‌పరంగా చాలా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇది చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నాం. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో తీస్తున్న 'వైశాఖం' మా బేనర్‌లో వచ్చిన 'లవ్‌లీ'కి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్‌ వుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్‌ నుండి కూడా బిజినెస్‌ పరంగా మంచి ఆఫర్స్‌ రావడం హ్యాపీగా వుంది. ఆగస్ట్‌లో జరిగే అయిదో షెడ్యూల్‌తో దాదాపుగా చిత్రం పూర్తవుతుంది'.. అన్నారు. 

హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, లతీష్‌, శృతినాయుడు, కళ్యాణి, కుమారి, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs