Advertisement
Google Ads BL

కృష్ణభగవాన్‌ కథతో అల్లరి నరేష్‌ మూవీ!


కామెడీ చిత్రాల కథానాయకుడిగా మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు అల్లరి నరేష్‌ హీరోగా త్వరలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ తాజా చిత్రానికి ప్రముఖ రచయిత, నటుడు కృష్ణభగవాన్‌ కథ, మాటలు అందిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించనున్నారు. 'అలాఎలా' చిత్ర విజయంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ దర్శకుడు అనీష్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ.'వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే హీరో అల్లరి నరేష్‌తో 'కెవ్వుకేక' చిత్రం తర్వాత మా బ్యానర్‌లో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, రచయిత కృష్ణభగవాన్‌ అందించే కథ, మాటలు హైలైట్‌గా నిలుస్తాయి. నరేష్‌ బాడీ లాగ్వేంజ్‌కి సరిపోయే వైవిధ్యమైన కథ ఇది. తొలి చిత్రం 'అలాఎలా'తో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల అభినందనలు అందుకున్న అనీష్‌కృష్ణ తప్పకుండా ఈ చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దుతాడనే నమ్మకం ఉంది. సెప్టెంబర్‌ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాము. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేస్తాము...అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: డి.జె. వసంత్‌, కథ-మాటలు: కృష్ణభగవాన్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీష్‌కృష్ణ.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs