నవీన్, మమతా కులకర్ణి, ఆరోహి, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్ పై కాటా ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్యాంకాక్ లో..? ఏం జరిగింది'. నందం రామారావు నిర్మాత. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టగా.. జూబ్లీహిల్స్ టిఆర్ఎస్ ఇంచార్జ్ మురళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
మురళి మాట్లాడుతూ.. ''ఈ సినిమా 40 రోజులు నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు కాటా ప్రసాద్ మాట్లాడుతూ.. ''మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ లవ్ స్టోరీ ఇది. సినిమాలో కామెడీ కూడా ఉంటుంది. 45 రోజులు సినిమాను బ్యాంకాక్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
నిర్మాత రామారావు మాట్లాడుతూ.. ''కథ నచ్చి నా కుమారుడ్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాను. ఈ ఒక్క సినిమాతో ఆగిపోకుండా ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలను నిర్మించాలని భావిస్తున్నాను'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ వేణు గజ్వేల్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేశాం. రిచ్ లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది'' అని చెప్పారు.
హీరో నవీన్ మాట్లాడుతూ.. ''ఇది నా డెబ్యూ ఫిల్మ్. అందరం హార్డ్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: వేణు గజ్వేల్, ఫొటోగ్రఫీ: సంతోష్ కె, నిర్మాత: నందం రామారావు, కో డైరెక్టర్: కృష్ణ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కాటా ప్రసాద్.