Advertisement
Google Ads BL

మెగాహీరో లాంచ్ చేసిన 'కబాలి' పాటలు!


సూపర్ స్టార్ రజినీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక ప్రధాన పాత్రల్లో పా.రంజిత్ దర్శకత్వంలో కలైపులి తాను నిర్మిస్తోన్న చిత్రం 'కబాలి'. ప్రవీణ్ వర్మ, కె.పి.చౌదరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైద్రాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వరుణ్ తేజ్ బిగ్ సీడీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''పెదనాన్న, రజినీకాంత్ గారు మంచి స్నేహితులు. బాబా సినిమా షూటింగ్ లో రజినీకాంత్ గారిని కలిశాను. ఆ సమయంలో నాకు అసలు మాటలు రాలేదు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. అంత పెద్ద యాక్టర్ అయినా.. సామాన్యంగా మాట్లాడతారు. ఈ సినిమాలో  రజిని గారిని చూస్తుంటే బాషా సినిమాలో రజిని గుర్తొస్తున్నారు. సినిమా కూడా ఆ రేంజ్ ఉంటుందని భావిస్తున్నాను. సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. 

దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ.. ''తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుంది.ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు. 

నిర్మాతలు ప్రవీణ్, కె.పి.చౌదరి మాట్లాడుతూ.. ''డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న మేము ఓ పెద్ద సినిమాతో నిర్మాతలుగా మారాలనుకున్నాం. ఆ సమయంలో మా ఆలోచనల్లో కబాలి తప్ప మరొక సినిమా లేదు. ఈ సినిమా తెలుగు రైట్స్ రావడానికి కారణమైన మోహన్ బాబు గారికి ఆర్థికంగా మాకు సపోర్ట్ ఇచ్చిన అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

నాని మాట్లాడుతూ.. ''చిన్నప్పటినుండి ఆయనను చూస్తూ పెరిగాను. ఈరోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాతలు ప్రవీణ్, కె.పి లు మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తులు. నాకు డైరెక్టర్ శంకర్ గారంటే చాలా ఇష్టం. కానీ రోబో సినిమా కంటే ఈ సినిమా కోసం నేను ఎక్కువగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా టీజర్, పాటలు బాష సినిమాను గుర్తుచేస్తున్నాయి. కబాలి మరొక బాష అవుతుందనే నమ్మకముంది'' అని చెప్పారు.

ధన్సిక మాట్లాడుతూ.. ''తెలుగులో ఇదివరకు నేను నటించిన ఏకవీర సినిమా రిలీజ్ అయింది. కబాలి సినిమా నాకు పెర్ఫెక్ట్ లాంచ్. రజినీకాంత్ గారి సరసన నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రంజిత్ గారికి థాంక్స్. సంతోష్ నారాయణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు. 

సంతోష్ నారాయణ్ మాట్లాడుతూ.. ''తమిళంలో ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో కూడా పాటలు మంచి ఆదరణ పొందుతాయని, సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. 

కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ''మద్రాస్ సినిమా చూసి మా అబ్బాయిని హీరోగా పెట్టి రంజిత్ తో సినిమా చేయాలనుకున్నాను. కానీ అప్పుడే రంజిత్, రజినీకాంత్ గారి సినిమాకు పని చేస్తున్నాడని తెలిసింది. మంచి దర్శకుడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు. 

బి.గోపాల్ మాట్లాడుతూ.. ''రజినీకాంత్ గారి బాష సినిమా పది సార్లు చూశాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. చెన్నైలో ఉండే రోజుల్లో రజిని గారి సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్లో చాలా గోల చేసేవాడ్ని. ఆయన స్పెషల్, డైనమిక్ పెర్సన్'' అని చెప్పారు.

రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు పాటలు రాయడం ఎంతో సంతృప్తిని, గర్వాన్ని ఇచ్చింది. మనసు పెట్టి పాటలు రాశాను. అర్ధవంతమైన సాహిత్యంతో ఉండే పాటలు. అన్నదమ్ముల సవాల్ అనే సినిమాలో రజినీకాంత్ గారిని ఎంత ఎనర్జిటిక్ గా చూశానో.. అంత ఎనర్జిటిక్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో రీతూ వర్మ, ప్రధాని రామకృష్ణ గౌడ్, పుల్లెల గోపిచంద్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs