Advertisement
Google Ads BL

'కొత్త కొత్తగా ఉన్నది' పాటలు విడుదల!


సమర్, అక్షిత, కిమయ ప్రధాన పాత్రల్లో శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పతాకంపై గుండేటి సతీష్ కుమార్ దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ నిర్మిస్తోన్న చిత్రం 'కొత్త కొత్తగా ఉన్నది'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను రసమయి బాలకిషన్ కిషన్ కు అందించారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''ఇదివరకు సినిమా అంటే హిట్, ఎబో ఏవరేజ్, బిలో ఏవరేజ్ అని ఉండేది. కాని ఇప్పుడు అలా లేదు. హిట్, ఫ్లాప్ అనే రెండింటి మీదే సినిమా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో కొత్త వాళ్ళను పెట్టుకొని సినిమా చేయడమనేది పెద్ద సాహసమనే చెప్పాలి. కాని ఈ చిత్ర నిర్మాతలు ఎంతో నమ్మకంగా సినిమా చేశారు. ఈ చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ, రవిరాజా పినిశెట్టిల వద్ద కొన్ని చిత్రాలకు పని చేశాడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలకు ఆడియో ఫంక్షన్స్, ప్రమోషన్ ఫంక్షన్స్ చాలా ముఖ్యం. కాని పెద్ద చిత్రాలకు వాటితో పనిలేదు. అనవసరంగా ముందే ట్రైలర్స్, కొన్ని సీన్స్, ఆడియో ఫంక్షన్స్ చేసి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఆ అంచనాలతో థియేటర్ కు వెళ్తే అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ అవ్వట్లేదు. ఈ మధ్యకాలంలో ఈ విధంగా చాలా చినెమాఉ ఫ్లాప్ అయ్యాయి. అసలు పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ ఎందుకు..? ఏ మీ హీరోకు థియేటర్ కు ప్రేక్షకులను రప్పించే కెపాసిటీ లేదా..? ముందుగానే సినిమాను సగం చూపించేసి ప్రేక్షకుల ఆసక్తిని చంపేస్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అవ్వడం వలన తిరిగి హీరోలు డబ్బులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతోంది. దయచేసి సినిమా విడుదలకు ముందు ఎలాంటి ఫంక్షన్స్ చేయొద్దని పెద్ద చిత్రాల నిర్మాతలకు తెలియజేస్తున్నాను'' అని చెప్పారు.

రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ''టైటిల్ లోనే కొత్తదనం చూపించారు. సినిమా కూడా కొత్తగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ చిత్ర దర్శకనిర్మాతలకు మంచి జరగాలి'' అని చెప్పారు.

దర్శకుడు గుండేటి సతీష్ మాట్లాడుతూ.. ''తెరపై నాకొక జీవితాన్ని ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. కొత్త కొత్తగా ఉన్నది ఒక ప్రేమ కథ. నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాం. కథ వినగానే నచ్చింది. వంశీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ.. ''నాకు ఈ సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్ ఇచ్చిన అందరికి థాంక్స్. ఇంతమంచి ట్యూన్స్ కుదరడానికి దానికి తగ్గ సిట్యుయేషన్స్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గారు మరిన్ని సినిమాలు చేయాలి'' అని చెప్పారు.

భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''అందరు కొత్తవాళ్ళతో చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

సి.కళ్యాన్ మాట్లాడుతూ.. ''ప్రభాకర్ గారు రంగస్థల నటుడు. ఆయన నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. సతీష్ ఎంతో నమ్మకంతో సినిమాను రూపొందించాడు. వంశీ మ్యూజిక్ మెలోడియస్ గా ఉంది. తనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి డైలాగ్స్: ఉదయ్ భగ్వథుల, ఆర్ట్: పి.ఎస్.వర్మ, ఎడిటర్: ఎస్.బి. ఉధవ్, సినిమాటోగ్రఫీ: జికె, మ్యూజిక్: వంశీ, నిర్మాతలు: పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: గుండేటి సతీష్ కుమార్. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs