Advertisement
Google Ads BL

'దర్శకుడు' కే ఫిక్సయ్యాడు!


వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ 'కుమారి 21ఎఫ్' చిత్రంతో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. 'కుమారి 21ఎఫ్‌'తో తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న ఈ యువ దర్శకుడు.. నిర్మాతగా మరో విలక్షణమైన చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. 'దర్శకుడు' టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి హర్ లవ్... హీజ్ ప్యాషన్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా అశోక్ అనే నూతన నటుడిని హీరోగా, హరిప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ సమర్పణలో బీఎన్‌సీఎస్‌పీ (bncsp) విజయ్‌కుమార్, ధామాస్ ఆదూరి, సత్తి నదీర్ రవిచంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'అంతకుముందు... ఆ తర్వాత' ఫేం ఇషా నాయికగా, రెండో నాయికగా పూజిత నటించనుంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ఇదొక విభిన్నమైన ప్రేమకథా చిత్రం.  ఈ నెల 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నేటి యువతరం మెచ్చే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కథ, కథనాలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి అని తెలిపారు. 

అశోక్, ఇషా, పూజిత, బ్రహ్మాజీ, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఫోటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: రామచంద్రాసింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా, లైన్ ప్రొడ్యూసర్: వీఈవీకేడీఎస్  ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరిప్రసాద్ జక్కా.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs