సుధాకర్ కొమ్మాకుల, సుదీర్ వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు బి.ఎ సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ముళ్ళపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'కుందనపు బొమ్మ'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
ముళ్ళపూడి వరా మాట్లాడుతూ.. ''ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమ కథ. బలమైన హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తరువాత శ్రీనివాస్ బొగ్గారం గారు మాతో అసోసియేట్ అవ్వడానికి ఆసక్తి చూపించారు. జూన్ 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
సుధాకర్ కొమ్మాకుల మాట్లాడుతూ.. ''ఇదొక గొప్ప సినిమా. నా పాత్ర నిడివి తక్కువగా ఉన్న మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్ర. నా నుండి ప్రేక్షకులు ఆశించే ఓ విభిన్నమైన చిత్రమిది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రమిది'' అని చెప్పారు.
సుదీర్ వర్మ మాట్లాడుతూ.. ''వరా గారు ఓ బొమ్మను చేక్కినట్ట్లుగా సినిమాను చెక్కారు. సూపర్ క్లాసికల్ విలేజ్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని గుర్తుచేసే విధంగా సినిమా ఉంటుంది'' అని చెప్పారు.
చాందిని చౌదరి మాట్లాడుతూ.. ''నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి మంచి సినిమా రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
నిర్మాతలలో ఒకరైన వంశీ మాట్లాడుతూ... ''కుందనపు బొమ్మ రెండు సంవత్సరాల ప్రయాణం. సమవత్సరంన్నర పాటు ఈ సినిమా స్క్రిప్ట్ కోసం పని చేశాం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మా కుందనపుబొమ్మ కు వచ్చిన సమస్యలేంటి..? వాటిని ఎవరు తీర్చారనేదే.. ఈ సినిమా కథ'' అని చెప్పారు.
శ్రీనివాస్ బొగ్గారం మాట్లాడుతూ.. ''రీసెంట్ గా ఈ సినిమా చూశాను. కుటుంబ విలువలతో కూడుకున్న కథ. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
అనురాధ ఉమర్జీ మాట్లాడుతూ.. ''అందరం ఫ్యామిలీలాగా కలిసి పని చేశాం. బాపు గారిని, రమణ గారిని గుర్తుచేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. మంచి ఫ్యామిలీ స్టోరీ'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతం కశ్యప్, కథావిస్తరణ-స్క్రీన్ ప్లే: కె.కె.వంశీ, శివ తాళ్లూరి, పాటలు: కీ.శే.శ్రీ ఆరుద్ర గారు, శివ శక్తి దత్తా, అనంత శ్రీరాం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.డి.జాన్, నిర్మాతలు: నిరంజన్, వంశీ, అనిల్, దర్శకుడు: ముళ్ళపూడి వరా.