Advertisement
Google Ads BL

నాని హీరోనా.. విలనా.. అని తెలిసేది ఆ రోజే!


నాని, సురభి, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో శ్రీదేవి మూవీస్ పతాకంపై ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జెంటిల్ మన్'. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో జరిగింది. దగ్గుబాటి రానా బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను మణిశర్మకు అందించారు. ఈ సంధర్భంగా..
రానా మాట్లాడుతూ.. ''నాని విలన్ గా ఈ సినిమాలో అధ్బుతంగా చేసి ఉంటాడు. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు
నాని మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేను హీరోనా.. విలనా అనే విషయం జూన్ 17న అందరికీ తెలుస్తుంది. నెగెటివ్ షేడ్ ఉన్న ఈ సినిమాలో నేను నటించడం ఆ సినిమాకు మణిశర్మ గారు మ్యూజిక్ చేయడం సంతోశంగా ఉంది. సురభి, నివేదలు చక్కగా నటించారు. శ్రీనివాస్ అవసరాలతో మరోసారి కలిసి నటిస్తున్నాను. తన డైరెక్షన్ లో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాను''అని చెప్పారు. 
ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ''జయాపజయాలను పట్టించుకోకుండా.. నాతో సినిమా చేయాలనుకున్న నిర్మాత గారికి కృతజ్ఞతలు. 2015లో నానికి కథ చెప్పాను. తను వెంటనే ఓకే చెప్పాడు. నాని తప్ప మరెవరూ ఈ కథకు న్యాయం చేయలేరు. మణిశర్మ గారి లాంటి సంగీత దర్శకుడితో పని చేయడం ఆనందంగా ఉంది. మంచి అర్ధవంతమైన పాటలను అందించారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అని చెప్పారు
అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా టీం అందరికీ జెంటిల్మెన్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. నాని కెరీర్ లో ముఖ్యమైన వ్యక్తి మోహన్ కృష్ణ గారు. మేమిద్దరం ఎప్పుడు కలిసినా.. నాని మోహన్ గారి గురించే మాట్లాడతాడు. మణిశర్మ గారికి నేను పెద్ద అభిమానిని. నాని, మణిశర్మ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు. 
సినిమాటోగ్రాఫర్ విందా మాట్లాడుతూ.. ''నాని గారితో రెండో సినిమా. అధ్బుతమైన నటుడు. మోహన్ కృష్ణ నాకు వరుస అవకాశాలు ఇస్తున్నాడు. నిర్మాత గారు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ రుణపడి ఉంటాను'' అని చెప్పారు.
సురభి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేను బాగమయ్యినందుకు చాలా సంతోశంగా ఉంది. ఇది నాకు స్పెషల్ మూవీ. నాని నిజమైన జెంటిల్మెన్. ఎంతో సపోర్ట్ చేశారు. నన్ను నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''జెంటిల్మెన్ అంటే హీరో, విలన్ రెండింటిలా ప్రవర్తించేవాడు. నాని ఈ సినిమాలో జెంటిల్మెన్'' అని చెప్పారు. 
మారుతి మాట్లాడుతూ.. ''నాని నాకు బ్రదర్ లాంటివాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాలు చూసే నేను దర్శకుడిగా మారాను. ఎథిక్స్ ఉన్న మనిషాయన. ఈ సినిమా మ్యూజిక్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నానితో మరిన్ని సినిమాలు చేయాలనుంది'' అని చెప్పారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ''ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మంచి టీచర్. ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. నాని టాలెంటెడ్ యాక్టర్. ఎలాంటి పాత్రలో అయినా నటించగల హీరో. మణిశర్మ గారు అధ్బుతమైన మ్యూజిక్ డైరెక్టర్. బ్రిలియంట్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు. 
హనురాఘవపూడి మాట్లాడుతూ.. ''మణిశర్మ గారికి నేను పెద్ద అభిమానిని. నాని ప్రతి సినిమాకు కొత్త సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాతో తనకు సెకండ్ హ్యాట్రిక్ మొదలవుతుంది'' అని చెప్పారు.  
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''నాని మంచి నటుడు. రియాలిటీకు దగ్గరగా ఉంటాడు. కృష్ణ ప్రసాద్ గారు డెడికేషన్ ఉన్న నిర్మాత. ఆయనకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs