బ్రహ్మోత్సవం ప్రపంచవ్యాప్తంగా సోలో సినిమాగా రిలీజైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నుండిమహేష్ బాబు హల్ చెల్ మొదలైంది. ట్రేడ్ మార్కెట్ లో ఈ చిత్రానికి 150 కోట్లు షేర్ అంచనాలున్నాయి. ఇది సంఖ్యాపరంగా ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ, ఆల్ రెడీ శ్రీమంతుడుతో 100 కోట్ల క్లబ్ లో చేరిన మహేష్ కు అసాధ్యం కాదని భావిస్తున్నారు.
ఇకపోతే మహేష్ కు ఒక ప్రత్యర్థి మాత్రం ఉన్నాడు. అదే రోను తుపాన్. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, తూగో, పగో, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రోను వల్ల బ్రహ్మోత్సవం ఓపనింగ్ కలక్షన్లపై ప్రభావం ఉంటుందా అని బయ్యర్లు మల్లగుల్ల పడుతున్నారు. కానీ చరిత్రలో సూపర్ హిట్ సినిమాలను తుపాన్ ఏమీ చేయలేదనే ఉదాహారణలున్నాయి. అక్కినేని నటించిన ప్రేమనగర్ చిత్రం,చిరంజీవి జగదేక వీరుడు... చిత్రం కూడా ఇలాంటి తుపాన్ లోనే విడుదలై ఘనవిజయాన్ని నమోదు చేసిన రికార్డులున్నాయి. అందువల్ల మహేష్ విజయపరంపరను ఏదీ ఆపలేదని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ప్రకృతిని కూడా మహేష్ గెలుస్తారని వారంటున్నారు.
తెలంగాణ సింగిల్ స్క్రిన్స్ లో అదనంగా మరొక ఆట ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది కేవలం ఒక రోజుకే పరిమితమైనప్పటికీ భారీ ఓపనింగ్స్ వచ్చాయి. దీనివల్ల తెలంగాణ స్టేట్ లో మహేష్ కలక్షన్ల పరంగ సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు.
Advertisement
CJ Advs