కృష్ణవంశీ హీరోయిన్ అనిపించుకోవాలని ఎవరికి మాత్రం వుండదు? ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. కృష్ణవంశీలాంటి దర్శకుడు తీసే ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా ఆనందమే అనేవాళ్లు చాలామందే. నిజంగా ఆయన అంత గొప్పగా సినిమాలు తీస్తుంటాడు. హీరోయిన్ల అందాన్ని, నటనలో ప్రతిభని రెట్టింపు చేసి చూపిస్తుంటాడని కృష్ణవంశీకి పేరుంది. ఆ విషయమే రెజీనాని బాగా ఆకర్షించినట్టుంది. అందుకే ఇప్పుడు కృష్ణవంశీతో కలిసి పనిచేయాలని ఆమె తెగ ప్రయత్నాలు చేస్తోందట. అవసరమైతే ఫ్రీగా కూడా నటిస్తానని ఆమె బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి అందులో నిజమెంతన్నది తేలాల్సి వుంది.
సందీప్‌కిషన్ కథానాయకుడిగా కృష్ణవంశీ నక్షత్రం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. నందితని సెలెక్ట్ చేసుకొన్నారని కూడా ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు రెజీనా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమే వ్యక్తిగతంగా చొరవ తీసుకొని కృష్ణవంశీ సినిమాలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తోందట. పారితోషికం విషయంలోనూ పట్టింపులేదని చెప్పినట్టు తెలుస్తోంది. రెజీనా మంచి నటి. పలు చిత్రాల్లో చక్కటి ప్రతిభ కనబరిచింది. కానీ ఇటీవల చెప్పుకోదగ్గ ఆఫర్లు రావడం లేదు. అందుకే తన టాలెంట్‌ని మరోసారిబయట పెట్టాలన్న కసితో వుందట. కృష్ణవంశీలాంటి దర్శకుడి సినిమా అయితే ఆ టాలెంట్ మరింత బయటికొస్తుందని, ఆ తర్వాత ఆఫర్లు అవే వెల్లువెత్తుతాయని రెజీనా భావిస్తోందట. అందుకే పారితోషికాన్ని కూడా ఆమె లెక్కచేయట్లేదని చెప్పుకుంటున్నారు. మరి ఆమెని కృష్ణవంశీ కరుణిస్తాడా అన్నది ఇప్పుడు తేలాలి.
Advertisement
CJ Advs