Advertisement
Google Ads BL

జ్యోతిలక్ష్మి పుస్తకం విడుదల!


ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జ్యోతిలక్ష్మి'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విమ‌ర్శ‌నాత్మ‌కంగా పుస్త‌క‌రూపంలో మంగళగౌరి రాశారు. ఈ పుస్తకాన్ని నటుడు తనికెళ్ళ భరణి బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ''పీహెచ్‌.డి అవార్డు చేసే స్థాయిలో మంగళగౌరి ఈ పుస్తకాన్ని రచించారు. ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం సినిమాలో డైలాగ్స్ విని.. నేను సినిమా చేస్తే అందులో డైలాగ్స్ మీరే రాయాలని పూరి దగ్గర అప్పుడే మాట తీసుకున్నాను. ఆ సినిమా డైలాగ్స్ కు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఛార్మి కెరీర్ లో అనుకోకుండా ఒక రోజు, జ్యోతిలక్ష్మి చిత్రాలు ఎప్పటికి నిలిచిపోతాయి. జ్యోతిలక్ష్మి కి సీక్వెల్ చేస్తారేమో'' అని చెప్పారు.

ఛార్మి మాట్లాడుతూ.. ''పూరి గారు ఎంతో ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా తీశారు. ఒక పుస్తకంతో మొదలైన ఈ సినిమా పుస్తకంతోనే ముగుస్తుంది'' అని చెప్పారు.

మంగ‌ళ‌గౌరి మాట్లాడుతూ.. ''ఆధునిక క‌న్యాశుల్కం అని నేను 'జ్యోతిల‌క్ష్మి' గురించి చెప్తాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క పురుషుడు త‌మ భార్య‌లో ఉన్న గొప్ప‌త‌నాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. ఈ సినిమా క్లైమాక్స్ నన్ను పుస్తకం రాసేలా చేసింది. భవిష్యత్తులో కూడా పూరి జగన్నాథ్ గారి సినిమాల గురించి.. ఛార్మి గురించి పుస్తకాలు రాయాలని ప్లాన్ చేస్తున్నాను'' అని చెప్పారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs