Advertisement
Google Ads BL

చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తోన్న బిజెపి!


ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రంలోని మోడీ సర్కార్‌ తేల్చిచెప్పింది. ఎన్డీఏ కూటమిలో ఉంటే ఉండు లేకపోతే బయటకు వెళ్లు అనే ధోరణిలో బిజెపి అధిష్టానం వైఖరి ఉంది. దీంతో ఏమిచేయాలో చంద్రబాబుకు పాలుపోవడం లేదు. అదే కేంద్రంలో బిజెపికి స్పష్టమైన మెజార్టీ రాకపోయి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మెజార్టీపై ఆధారపడి ఉండేలా అంటే ఒకప్పటి వాజ్‌పేయ్‌ గవర్నమెంట్‌ తరహాలోలా పరిస్థితి ఉండి ఉంటే బిజెపి ఇలా మాట్లాడగలదా? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన తరహాలోనే ఏపీకి కూడా కేంద్రం నిదులిచ్చింది తప్ప అదనంగా ఏమీ ఇవ్వలేదని టిడిపి నాయకుల వాదన. తాము ఇప్పటికే రాజధాని కోసం రూ.2,050కోట్లు ఇచ్చామని, కానీ ఇప్పటికీ ఏపీ రాజధాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదనేది బిజెపి వాదన. అలాగే పోలవరంకు జాతీయ హోదా ప్రకారం ఇప్పటికే కొన్ని నిదులను కేటాయించామని, కానీ పోలవరం పరిస్థితి చూస్తే ఏమాత్రం పురోభివృధ్దిలేదనేది బిజెపి వాదన, రాజధాని విషయానికి వస్తే తాత్కాలిక సచివాలయం.. అంటూ అన్ని తాత్కాలిక పనులు చేస్తున్నారని, వాటికి కేంద్రం నిదులు ఇవ్వాల్సిన పనిలేదని, నిజంగానే శాశ్వత రాజధాని కోసం ఖర్చు చేస్తూ ఉండి ఉంటే.. అందులో ప్రగతి కనిపిస్తే తాము నిధులను కేటాయిస్తామని, అంతేగానీ ఇచ్చిన నిధులకు లెక్క చెప్పకుండా తమపై నిందవేయడం తగదని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్రం ఒక దానికోసం ఇచ్చిన నిధులను వేరే పధకాలకు, తమ వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకునే పనులు, సంక్రాంతి సంబరాలు, రంజాన్‌ తోఫా, రైతుల రుణమాఫీ.. ఇలా ప్రజాకర్షక పథకాలకు నిదులను మళ్లించి ఇప్పుడు తమను తప్పుపట్టడం సరికాదని బిజెపి వాదన. ముందుగా తామిచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకొని అప్పటికీ అభివృద్ది జరగకపోతే అప్పుడు ప్రత్యేక హోదా అడిగితే సమంజసంగా ఉంటుందని, అంతేగానీ తామిచ్చిన నిధులను పప్పు, బెల్లం లా ఖర్చుపెడూతూ తమకు అది కావాలి.. ఇది కావాలని కోరితే ఎలా? అనేది బిజెపి ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం. మరి దీనికి చంద్రబాబు వద్ద ఏమైనా సమాధానం ఉందా? లేదా? అనేది అసలు ప్రశ్న.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs