Advertisement
Google Ads BL

ఒక్క అమ్మాయి తప్ప ఆడియో..!


సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ఒక్క అమ్మాయి తప్ప. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది.వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, గుణశేఖర్, సాయిదరమ్ తేజ్, సందీప్ కిషన్, నిత్యామీనన్, రాశిఖన్నా, రెజీనా, మిక్కి జె.మేయర్, రవికిషన్, మేర్లపాక గాంధీ, గౌతంరాజు, తనికెళ్ల భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నరు. ఆడియో సీడీలను సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించి తొలి సీడీని బోయపాటి శ్రీనుకు అందజేశారు.

Advertisement
CJ Advs

బోయపాటి శ్రీను మాట్లాడుతూ >...  తెలుగులో అద్భుతమైన సంగీత దర్శకులున్నారు. కానీ మిక్కి జె.మేయర్ గారు మెలోడీ సాంగ్స్ ను అద్భుతంగా ఇస్తారు. రాజసింహ సరస్వతి పుత్రుడు. మంచి హార్డ్ వర్కర్. స్క్రిప్ట్ పరంగా నాకు సరైనోడులో ఆయన హెల్ప్ చేశారు. దర్శక నిర్మాతలకు ఈ సినిమా మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను> అని  అన్నారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ... రాజసింహ ఏడేళ్ల క్రితం ఈ కథను నా కళ్లకు కట్టే విధంగా చెప్పాడు. ఈ కథను ఎవరికైనా ఇవ్వాలని తను ప్రయత్నించాడు కానీ తన కథకు తనే దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. ఛోటా కె.నాయుడు వల్ల సినిమా బడ్జెట్ 25 కోట్లు కావాల్సింది, కానీ 15 కోట్లు మాత్రమే అయ్యిందనుకుంటున్నాను. సందీప్, నిత్యామీనన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది నా ప్రాజెక్ట్ లాంటిది. ఎందుకంటే ఈ సినిమా ప్రాజెక్ట్ కావడంలో నా పార్ట్ కూడా ఉంది. సందీప్ సినిమాలన్నీ ఒకలా ఉంటే ఈ సినిమాలో తన నటన మరోలా ఉంటుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... నా మొదటి సినిమా రేయ్ కు రాజసింహగారు డైలాగ్స్ రాశారు. అలాగే మిక్కిగారితో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. రవికిషన్ గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నిత్యామీనన్ గారికి యూనిట్ సభ్యులకు అభినందనలు’’ అన్నారు.

గుణ శేఖర్ మాట్లాడుతూ >... సందీప్ ప్రస్థానం నుండి తన కెరీర్ ను డిఫరెంట్ గా స్టార్ట్ చేశాడు. నిత్యామీనన్ వల్ల ఈ సినిమాకు పత్యేకమైన గుర్తింపు వచ్చింది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. నా దర్శకత్వంలో వచ్చిన ఒకట్రెండు సినిమాల్లో తప్ప అన్నింటిలో పార్ట్ అయ్యాడు. కాంప్లికేటెడ్ పాయింట్ ను ఎన్నుకుని, కొత్త ఆలోచనతో చేసిన సినిమా. తప్పకుండా సినిమా విజయవంతమవుతుందిఅన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ 

స్త్రీలను గౌరవిస్తే అక్కడ దేవతలుంటారు అని చెప్పే సినిమా. ఒక మంచి సినిమాలో, హిట్ సినిమానో తీయడానికి చేసిన ప్రయత్నం కాదు, గొప్ప సినిమా తీయడానికి చేసిన ప్రయత్నం. రాజసింహ కమర్షియల్ డైరెక్టర్, నాపై నమ్మకంతో ఈ కథను నాకు ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్. ఈ సినిమా కోసం ఛోటా మామ డబ్బులు తీసుకోకుండా వర్క్ చేశారు. మిక్కితో రెండోసారి వర్క్ చేస్తున్నాను. నిర్మాతగారు మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్. ఈ సినిమా మా మూడు సంవత్సరాల నమ్మకం. నా బెస్ట్ పెర్ ఫార్మెన్స్ చూస్తారు. ఆ క్రెడిట్ లో ఎక్కువభాగం నిత్యామీనన్ కే దక్కుతుంది అన్నారు.

 

నిత్యామీనన్ మాట్లాడుతూ >... ఇది దర్శకుడి చిత్రం. నేను చూసిన రైటర్స్ లో ఎంటర్ టైనింగ్ గా, కంటెంట్ బేస్డ్ గా గ్రిప్పింగ్ కథను రాసుకున్నారు.  ఒక్క నిమిషం కూడా బోర్ ఫీల్ కారు. ఈ సినిమానే కాకుండా రాజసింహ చేసే ప్రతి సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాను హిట్ గా నేను ఫీలయ్యాను. సందీప్ అమేజింగ్ కోస్టార్. మిక్కీ వండర్ ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. ఆ సాంగ్స్ వినగానే సోల్ టచింగ్ గా అనిపించింది. సినిమాను అందరూ ఆదరించాలి అన్నారు.

సందీప్ కిషన్నిత్యా మీనన్ రేవతి రవి కిషెన్అలీఅజయ్,బ్రహ్మాజీతనికెళ్ళభరణిరాహుల్ దేవ్పృథ్వీసప్తగిరితాగుబోతు రమేష్,నళినిజ్యోతి,రేవతి తదితరులునటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌చిన్నామ్యూజిక్‌మిక్కి జె.మేయర్‌ఎడిటింగ్‌గౌతంరాజుపాటలు : శ్రీమణిశ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ఆళ్ళ రాంబాబుసహ నిర్మాతలు  : మాధవి వాసిపల్లిబోగాది స్వేచ్ రెడ్డి , నిర్మాతబోగాది అంజిరెడ్డికథమాటలు,స్క్రీన్‌ప్లేదర్శకత్వం : రాజసింహ తాడినాడ.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs