Advertisement
Google Ads BL

మూలాలను వెతుక్కునే ప్రయత్నమే 'అ ఆ'!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందించిన చిత్రం 'అ ఆ' అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అన్నది ఉప శీర్షిక. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..  

Advertisement
CJ Advs

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''స్టేజీ మీద నేను ధైర్యంగా మాట్లాడతాననుకుంటారు కాని నాకు బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గు. మనసులో బెరుకు బెరుకుగా ఉంటుంది. నితిన్ కు నేనంటే ఎంత ఇష్టమో ఈరోజే తెలిసింది. తనకు ఈ సినిమా పెద్ద విజయం సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను నా సినిమాలు తప్ప పక్కన సినిమాలను పట్టించుకోను. కాని ఇష్క్ సినిమా సమయంలో నితిన్ ను చూసినప్పుడు నాకు తమ్ముడి లాగా అనిపించాడు. అందుకే ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్లాను. తెలుగులోనే కాదు భారతదేశంలో హీరోగా తనకు మంచి పేరు రావాలి. మిక్కీ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సమంత, నదియలకు నా బెస్ట్ విషెష్. చినబాబు గారు అండగా ఉండే నిర్మాత. ఆయనంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ 'గోకులంలో సీత' సినిమాకు అసిస్టెంట్ రైటర్ గా పని చేశారు. ఆ సినిమాకు ఎక్కువ శాతం ఆయనే డైలాగ్స్ రాశారు అప్పటికి ఆయనతో అంత పరచయం లేదు. చిరునవ్వుతో సినిమా రషెష్ చూశాను. ఒక సీన్ చూడగానే డైలాగ్స్ బాగా నచ్చాయి. ఆరోజు నుండి ఆయనతో ఉన్న పరిచయం కేవలం సినిమా తీయడం మాత్రమే కాదు. నిజజీవితంలో విలువలు పాటించే వ్యక్తి కాబట్టి ఆయనంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. మా ఇద్దరి మధ్య స్నేహం ఒకరి మీద ఒకరం గౌరవ ప్రధంగా ఉంటాం. నటుడు అనేవాడు రైటర్ రాసిన డైలాగ్స్ ను చెప్పేవాడే కాని రాసేవాడు కాదు. నేను రచయితలను గౌరవిస్తాను. హీరోకు మంచి ఇమేజ్ వచ్చిందంటే దాని వెనుక రచయిత కథ ఉందని బలంగా నమ్మే వ్యక్తిని నేను. అలాంటి ఇమేజ్ త్రివిక్రమ్ నాతో పాటు చాలా మంది హీరోలకు ఇచ్చాడు. ఇలాంటి రచయిత తెలుగు ఇండస్ట్రీలో ఉండడం ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. అత్తారింటికి దారేది కంటే ముందే నాకు ఈ సినిమా కథ తెలుసు. కుటుంబంతో చూడదగ్గ చక్కటి ఫిలిం. తెలుగు ఇండస్ట్రీకు మరో బలమైన హిట్ సినిమా వస్తుందని నమ్ముతున్నాను'' అని చెప్పారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు టైటిల్ గా అ ఆ ఎందుకు పెట్టారని అందరు అడుగుతున్నారు. మళ్ళీ అక్షరాలు దిద్దుకోవడం నుండి జీవితం మొదలు పెట్టే పరిస్థితి వచ్చిందని అన్నాను(నవ్వుతు..). మనం ఎక్కడి నుండి వచ్చామో మరచిపోతుంటాం. ఒక్కసారి వెనక్కి తిరిగి మూలాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అటువంటి మూలాలను వెతుక్కునే ప్రయత్నమే 'అ ఆ'. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని ప్రయాణాలను ఆపాలనిపించదు. నన్ను చిన్నప్పటి నుండి ఇక్కడికి తీసుకొచ్చిన ప్రయాణాలు, అనుభూతులను మర్చిపోలేను. రాసేసిన డైరీను మళ్ళీ తిరిగి చదువుకోవాలనిపిస్తుంది. అలా నేను రాసిన డైరీ అ ఆ ను మరోసారి చదువుకోవాలనిపించింది. దానినే సినిమాగా తీశాను. నా వెనుక బలంగా ఉండి సినిమా తీయడానికి ప్రోత్సహించిన నిర్మాత రాధాకృష్ణ గారు. ఇది కథ ఉన్న సినిమా అని నమ్మి చేసిన నితిన్ కు థాంక్స్. అనసూయ రామలింగం అనే పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన సమంత కు థాంక్స్. నాగవల్లి అనే పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ నటించింది. పది నిమిషాల నేరేషన్ లోనే ఒక సాంగ్ కంపోజ్ చేసి ఇచ్చాడు మిక్కీ. స్పాంటేనియస్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఇంత అందంగా రావడానికి కారణం నటరాజన్ సుబ్రహ్మణ్యన్. నాకు సపోర్ట్ చేసిన టెక్నికల్ టీం అందరికి నా థాంక్స్. ఈ సినిమా, పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.    

నితిన్ మాట్లాడుతూ.. ''అ ఆ అంటే అందమైన ఆహ్లాదకరమైన సినిమా. సినిమాలో అన్నీ ఉంటాయి. సినిమాకు నిర్మాత అనేవాడు చాలా ముఖ్యం. మమ్మల్ని నమ్మి మాపై డబ్బు పెట్టిన రాధాకృష్ణ గారికి థాంక్స్. మిక్కీ అధ్బుతమైన పాటలు ఇచ్చాడు. త్రివిక్రమ్ గారు వాకింగ్ ఎన్సైక్లోపీడియా, డిక్షనరీ, గూగుల్. ఆయనతో వర్క్ చేసిన ప్రతి క్షణం ఎప్పటికీ గుర్తుండి పోతుంది'' అని చెప్పారు.   

సమంత మాట్లాడుతూ.. ''నా ప్రొడ్యూసర్ కోసం, హీరో కోసం, డైరెక్టర్ కోసం సినిమా గెలవాలి. సినిమా హిట్ అంతే'' అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ.. ''త్రివిక్రమ్ గారి ప్రతి సినిమా ఒక పుస్తకం లాంటిది. నితిన్ మంచి పెర్ఫార్మార్. నితిన్, సమంతలది మంచి కాంబినేషన్. హారిక అండ్ హాసిని నా హోం బ్యానర్ లాంటిది. రాధాకృష్ణ గారు అధ్బుతమైన ప్రొడ్యూసర్. మిక్కి సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ట్రెండ్ సెట్టర్ అవుతాయి. సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందనడంలో సందేహం లేదు' అని చెప్పారు. 

మిక్కి జె మేయర్ మాట్లాడుతూ..''త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. నాకు సపోర్ట్ చేసిన సింగర్స్ కు థాంక్స్. రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్యలు మంచి సాహిత్యాన్ని అందించారు'' అని చెప్పారు.

శరత్ మరార్ మాట్లాడుతూ.. ''మిక్కీ పాటలలో సోల్ ఉంది. ప్రతి సాంగ్ చాలా పాజిటివ్ గా ఉంది. ఫైనెస్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ''త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేనొక పాట రాసాను అని చెప్పుకోవడం కంటే త్రివిక్రమ్ గారితో ట్రావెల్ చేసి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పడానికి ఇష్టపడతాను'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నదియ, సీనియర్ నరేష్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: రాధా కృష్ణ, దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs