రాహిల్స్ మూవీ పతాకంపై రఫీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రం 'Mr.రాహుల్ పక్కా ప్రొఫెషనల్'. ఈ సినిమా ప్లాటినం డిస్క్ వేడుకను బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా..
రఫీ మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని కోఆపరేటివ్ పద్ధతిలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమాలోని హాస్యం, సంగీతం, సందేశం మరియు సన్నివేశాలు అత్యంత సహజంగా ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
కోందండ రామ్ మాట్లాడుతూ.. ''టైటిల్ ఆకర్షణీయంగా ఉంది. టైటిల్ కు తగ్గట్లుగానే సినిమా కూడా ఉంటుందని భావిస్తున్నాను. ఓ యుక్త వయసు కుర్రాడు తనను తను నమ్ముకొని జీవితంలో ఎలా ఎదిగాడనే మంచి కాన్సెప్ట్ తో సినిమా చేశారు.హాస్యంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను '' అని చెప్పారు.