చరణ్, రాజ్, సంపూర్నేష్ బాబు, హమీదా, రోషన్ ప్రధాన తారాగణంగా మల్లిపూడి రాంజీ సమర్పణలో మారుతి టీం వర్క్స్, శ్రీ వెంకట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'భద్రం becareful బ్రదరూ'.ఈ చిత్రానికి రాజేష్ పులి దర్శకుడు. బోనం కృష్ణ సతీష్, అడ్డగార్ల జగన్ బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ నిర్మాతలు. ఇటీవల విడుదలయిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. దీంతో చిత్రబృందం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించారు. మారుతి ప్లాటినం డిస్క్ లను చిత్రబృందానికి అందజేశారు. ఈ సందర్భంగా..
మారుతి మాట్లాడుతూ.. ''ముగ్గురు షార్ట్ ఫిలిం చేసే యువకులు సంపూర్నేష్ బాబు హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో సంపూర్నేష్ బాబు పాత్ర కీలకమైనది. ఈ సినిమాకు మ్యూజిక్ పెద్ద ఎసెట్. ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని'' చెప్పారు.
దర్శకుడు రాజేష్ పులి మాట్లాడుతూ.. ''ఇదొక కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. సినిమాలో సంపూ గెటప్స్ అందరిని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. టీం అంతా కష్టపడి చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని'' చెప్పారు.
సంగీత దర్శకుడు జె.బి మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన మారుతీ గారికి థాంక్స్. ఆడియోలానే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేనొక మంచి పాత్రలో కనిపిస్తాను. ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాను'' అన్నారు.
ఈ చిత్రానికి కథ: మారుతి అండ్ టీం, డైలాగ్స్: వై.నివాస్, ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, ఫోటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, మ్యూజిక్: జె.బి, నిర్మాతలు: బోనం కృష్ణ సతీష్, అడ్డగార్ల జగన్ బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ, దర్శకుడు: రాజేష్ పులి.