Advertisement
Google Ads BL

త్రిష సినిమాలో నారాహీరో గెస్ట్ రోల్!


త్రిష, గణేష్ వెంకటరామన్ ప్రధాన పాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నాయకి. గోవి దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను త్రిషకు అందించారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''టైటిల్ చాలా బావుంది. ఈ సినిమాలో త్రిష నటించడంతో పాటు ఒక పాట కూడా పాడింది. భాస్కర్ భట్ల మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ సంవత్సరంలో లేడీ ఓరియెంటెడ్ సినిమా రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు సందేశం కూడా అందిస్తుందని భావిస్తున్నాను. గిరిధర్ గారు తలలో నాలుక లాంటి వారు. జర్నలిస్ట్ గా ఉండే ఆయన నిర్మాతగా మారారు. ఈ సినిమా అందరికి మంచి పేరు, లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

త్రిష మాట్లాడుతూ.. ''రఘు కుంచె గారు అధ్బుతమైన మ్యూజిక్ అందించారు. సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

గోవి మాట్లాడుతూ.. ''లయన్ సినిమా సమయంలో త్రిషకు కథ చెప్పాను. వెంటనే ఓకే చెప్పారు. నన్ను నమ్మి సినిమా చేయడానికి ముందుకొచ్చిన గిరిధర్ గారికి నేను రుణపడి ఉంటాను. రాజ్ కందుకూరి గారు లేకపోతే ఈ సినిమా మొదలయ్యేది కాదేమో. ఈ సినిమా ద్వారా సత్యం రాజేష్ ను హీరోగా పరిచయం చేస్తున్నాను. నారా రోహిత్ గారు ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. రఘు కుంచె మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రస్తుతాన్ని, గతాన్ని మిక్స్ చేస్తూ నడిచే కథ. ఇది రెగ్యులర్ హారర్ సినిమా కాదు. రెట్రో హారర్ సినిమా. సుమారుగా 35% గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరికి థాంక్స్'' అని చెప్పారు. 

గిరిధర్ మాట్లాడుతూ.. ''ఫిలిం జర్నలిస్ట్ గా ఉండే నేను నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మించాను. ఈ సినిమా ఆడియోకు బాలకృష్ణ గారు రావడం సంతోషంగా ఉంది. త్రిష గారికి మ్యానేజర్ గా కొన్ని సంవత్సరాలు పని చేశాను. మొదట ఆమెతో థ్రిల్లర్ సినిమా చేయాలనుకున్నాం. కాని గోవి గారు చెప్పిన కథ నాతో పాటు త్రిష గారికి కూడా బాగా నచ్చింది. త్రిష గారి కెరీర్ మంచి సినిమా అవుతుంది. మూడు డైమేన్షన్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. ఒక హిట్ చిత్రంగా త్రిష గారికి ప్రెజంట్ చేయాలనేది నా కోరిక. ఇది రెగ్యులర్ హారర్ సినిమా కాదు. హారర్ లో కొత్త రకం. రఘు కుంచె నాలుగు అద్బుతమైన బాణీలను అందించారు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''ఇదొక రెట్రో హారర్ కామెడీ సినిమా. ఒక కొత్త పాయింట్ ను తీసుకొని గోవి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు'' అని చెప్పారు.

గణేష్ వెంకటరామన్ మాట్లాడుతూ.. ''త్రిష గారితో ఇది నాకు రెండో సినిమా. త్రిష సినిమాల్లో బెస్ట్ క్యారెక్టర్ ఇదే. హారర్ సినిమాలో ఇదొక కొత్త సినిమా. గోవి గారు అధ్బుతంగా సినిమా తీశారు. రఘు కుంచె మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మంచి రోల్ చేశాను. వర్షం సినిమా నుండి త్రిష గారితో ట్రావెల్ చేస్తున్నాను. ఆమెతో మరోసారి నటించడం సంతోషంగా ఉంది. గోవి, గిరిధర్ ల గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కళ: కె.వి.రమణ, కూర్పు: గౌతం రాజు, పాటలు: భాస్కర్ భట్ల, సంగీతం: రఘు కుంచె, ఫోటోగ్రఫీ: జగదీశ్ చీకటి, నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: గోవి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs