సాయిరామ్ శంకర్, శరత్ కుమార్, రేష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం 'నేనో రకం'. సుదర్శన్ సలేంద్ర దర్శకుడు. దేపా శ్రీకాంత్ నిర్మాత. ఈ సినిమా టీజర్ ను శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. శరత్ కుమార్ లాంటి ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. టైటిల్ కూడా చాలా బావుంది. పూరిజగన్నాథ్ గారి స్టైల్ లో ఉంది. ఊపిరి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి మహిత్. తను ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం సంతోషంగా ఉంది. అమేజింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. పాటలు కూడా బావుంటాయని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
''సమాజంలో ఉన్న ఒక సమస్య ఇతివృత్తమే ఈ సినిమా. తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని ప్రధాన అంశంగా తీసుకొని సినిమాను రూపొందించాం. సాయిరామ్ శంకర్ లేకపోతే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. మహిత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు. ఈ సినిమాలో శరత్ కుమార్ గారు నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నారు. రాధిక గారు ఈ సినిమా చూసి తమిళంలో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారని '' దర్శకుడు సుదర్శన్ చెప్పారు.
''లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మే నెల మొదటివారంలో సినిమా పాటలను రిలీజ్ చేసి.. మే చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని'' నిర్మాత దేపా శ్రీకాంత్ అన్నారు.
''ఈ సినిమా మంచి హిట్ కావాలి. మహిత్ కు ఈ చిత్రంతో బెస్ట్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు రావాలని'' హీరో సాయిరామ్ శంకర్ అన్నారు.
''సంవత్సరంన్నర గా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. మంచి టీం కుదిరింది. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనిపిస్తుందని'' మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, ఫోటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఫైట్స్: పటాస్ వెంకట్, కింగ్ సాల్మన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, రెహ్మాన్, శ్రీమాన్, చల్లగాలి, నిర్మాత: దేపా శ్రీకాంత్, రచన,దర్శకత్వం: సుదర్శన్ సలేంద్ర.