నేనే శేఖర్, కార్తిక్ రెడ్డి ప్రధాన పాత్రల్లో గీతాశ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై నేనే శేఖర్ దర్శకత్వంలో యలమంచిలి సిస్టర్స్ నిర్మించిన చిత్రం అమ్మాయంటే అలుసా..! ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. నటి కవిత బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
కవిత మాట్లాడుతూ.. ''అనాధిగా స్త్రీలంటే అందరికి అలుసే. ఇప్పటికి చాలా మంది అదే ధోరణిలో ఆలోచిస్తుంటారు. మహిళలు హింసకు గురికాకూడదు.. వాళ్ళను అలుసుగా చూడకూడదనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చక్కటి టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాకు కథే హీరో. మంచి సందేశాన్ని కూడా చెప్పబోతున్నారు. ఇలాంటి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.
కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ''మంచి మ్యూజిక్ కుదిరింది. శేఖర్ గారు మొత్తం తానై సినిమాకు పని చేశారు. ఆడియో, సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'' అన్నారు.
నేనే శేఖర్ మాట్లాడుతూ.. ''కసితో ఈ సినిమా చేశాను. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరకాలని ఈ సినిమా చేశాం. ఆడవాళ్ళను అలుసుగా చూడకూడదనే కథాంశంతో రూపొందించిన చిత్రమిది'' అని చెప్పారు.
కరుణాకర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాసం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయని'' చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: కరుణాకర్, కెమెరా: జీవా, కో ప్రొడ్యూసర్స్: గౌరీ శంకర్, మాధవరెడ్డి, నిర్మాతలు: యలమంచిలి సిస్టర్స్, కథ-మాటలు-దర్శకత్వం: నేనే శేఖర్.