నిఖిల్, ఇషిక, నీరజ్, సమ్రీన్, జాహ్నసాయి, కావేరి, లిఖిత్, రేవతి, సాయిప్రనీత్, బిట్టు, నరేష్, సిద్ధు, చరణ్ ప్రధాన పాత్రల్లో రామ్ కుమార్ దర్శకత్వంలో జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటాచారి ఎర్రోజు నిర్మిస్తోన్న చిత్రం 'అంతా Vచిత్రం'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, రవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రామ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''చిన్నపిల్లల్ని హీరో, హీరోయిన్లుగా తీసుకొని కొత్తగా సినిమా చేయాడానికి ప్రయత్నిస్తున్నారు. భోలే మంచి ట్యూన్స్ అందిస్తున్నారు. టీం అందరికి నా ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.
''పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించే సినిమా ఇది. సినిమాలో మాస్ ఎలిమెంట్స్, క్లైమాక్స్ లో మెసేజ్ ఉంటుంది. సినిమాలో మొత్తం 5 పాటలు, మూడు ఫైట్స్ ఉంటాయి. చిన్నపిల్లలు అందరు స్టార్ హీరో, హీరోయిన్ల పాత్రల్లో నటించేలా కథను డిజైన్ చేశామని'' దర్శకుడు రామ్ కుమార్ అన్నారు.
''ఏప్రిల్ 13 నుండి 40 రోజులు రెగ్యులర్ షూటింగ్ జరిపి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నామని'' నిర్మాత వెంకటాచారి ఎర్రోజు తెలిపారు.
ఈ చిత్రానికి ఫైట్స్: రవి, సూపర్ ఆనంద్, ఆర్ట్: విజయ్ కృష్ణ, డ్యాన్స్: కిరణ్, మురళి, బాలు, మ్యూజిక్: బాంబే బోలే, సినిమాటోగ్రఫీ: మురళి వై.కృష్ణ, స్టోరీ, డైలాగ్స్: ఎస్.రమారామ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహ్మద్ అస్లాం, ప్రొడ్యూసర్: వెంకటాచారి ఎర్రోజు, డైరెక్టర్: రామ్ కుమార్.