అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు, మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అబ్బాస్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకంపై నాకూ ఓ లవరుంది, దక్షిణ మధ్య భారత జట్టు వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన కె.సురేష్‌బాబు కన్నడలో షేకింగ్ హ్యాండ్స్ పేరుతో ఓ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని నిర్మించారు. డిఫరెంట్ మూవీస్‌ని నిర్మిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న కె.సురేష్‌బాబు ఇప్పుడు దర్శకుడుగా మారుతున్నారు. అజహరుద్దీన్ కుమారుడు అబ్బాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఇద్దరికీ కొత్తేగా పేరుతో ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నారు కె.సురేష్‌బాబు. ఈ చిత్రంలో అబ్బాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం చాలా గ్రాండ్‌గా జరగనుందని కె.సురేష్‌బాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి మహమ్మద్ అజహరుద్దీన్‌తోపాటు బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని, తన డైరెక్షన్‌లో రూపొందనున్న ఇద్దరికీ కొత్తేగా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని కె.సురేష్‌బాబు తెలిపారు.
Advertisement
CJ Advs