'సోలో' సినిమా తరువాత నా కెరీర్ లో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని నేను చెప్పినట్లుగా జరిగింది. 'సావిత్రి' సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిందని హీరో నారా రోహిత్ చెప్పారు. నారా రోహిత్, నందిత జంటగా పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా.వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన చిత్రం 'సావిత్రి'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నారా రోహిత్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నాకు నటించే అవకాశం ఇచ్చిన పవన్ సాధినేని కు, ఎక్కువ థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేసిన నిర్మాతకు నా కృతజ్ఞతలు. ఇంతగా ఆదరించిన ప్రేక్షకులందరికీ సినిమాను అంకితం చేస్తున్నానని'' చెప్పారు.
''మూడు రోజులుగా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఈ సినిమాతో మాలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయిందని'' దర్శకుడు పవన్ సాధినేని తెలిపారు.
''మొదటి మూడు రోజుల్లో మేము ఆశించిన రెవెన్యూ వచ్చింది. పవన్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. విజయవాడలో నేను సినిమా చూశాను. థియేటర్ రెస్పాన్స్ కూడా బావుందని'' నిర్మాత రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
''రోహిత్ లాంటి నటుడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని'' హీరోయిన్ నందిత చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ పాల్గొని సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్, డైలాగ్స్: కృష్ణ చైతన్య, సంగీతం: శ్రవణ్ , ఎడిటర్: గౌతం నెరుసు, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పవన్ సాదినేని, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత: డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్.