మంచు కొండ అనగానే గజ గజ వణికిపోతాం. ఇక అక్కడికి వెళ్లామంటే సరే సరి! కోటు మీద కోటు వేసుకొని తీరాల్సిందే. అప్పటికి కూడా చలి ఆగదు. కానీ మన హీరోయిన్లకి మాత్రం ఆ బాధలేం లేవు. వాళ్లు అరకొర దుస్తులతోనే మంచు కొండల్లోకి దిగుతారు. హాయిగా పాట కూడా పాడుకొంటారు. మరి వాళ్లకి చలిపెట్టదా? అనేదాగా మీ ప్రశ్న. మంచు కొండలకే సెగలు పుట్టించే సోయగాలు వాళ్లవి. ఆ అందాన్ని చూసి మంచుకి కూడా వేడి పుట్టేస్తుంది. అలాంటప్పుడు చలేం ఉంటుంది... గిలిగింతలు తప్ప. అలా మంచు కొండలకీ గిలిగింతలు పెడుతూ మన కాజల్ ఓ పాటేసుకొంది. ఇదంతా సర్దార్ గబ్బర్‌సింగ్ కోసమేనండోయ్. ఇటీవలే రెండు పాటల్ని స్విట్జర్లాండ్‌లో షూట్ చేశారు. ఆ పాటలకోసం వెళ్లినప్పుడే కాజల్ ఇలా ఫొటో తీయించుకొంది. ఈమె సోకుల్ని చూసి స్విట్జర్లాండ్ మంచు కొండల జన్మ ధన్యమై వుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ సోకులు తెరపై ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం సర్దార్ విడుదలయ్యే రోజు... ఏప్రిల్ 8వరకు ఆగాల్సిందే.