Advertisement
Google Ads BL

'ఊపిరి' మాలో నమ్మకాన్ని పెంచింది: నాగ్


టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'ఊపిరి'. పివిపి బ్యానర్‌పై పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం మార్చి 25న విడుదలై సూపర్‌ హిట్‌ కలెక్షన్స్‌ తో రన్‌ అవుతోంది. ఓవర్‌సీస్‌లో మిలియన్‌ డాలర్స్‌ ను కలెక్ట్‌ చేసి ప్రముఖ దినపత్రిక ఫోర్బ్స్‌ ప్రశంసలు కూడా అందుకుంది. సినిమా విజయవంతమైన సందర్భంలో రీసెంట్‌గా వీల్‌ చెయిర్‌ ఫ్రెండ్స్‌ తో చిత్రయూనిట్‌  అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌ లో చిట్‌ చాట్‌ జరిపింది. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ.. ''వీల్‌ చెయిర్‌లో ఉన్నవారు ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మగారు అర్థరైటిస్‌ సమస్యతో ఎనిమిదేళ్లు ఇబ్బంది పడటం చూసి ఎంతో బాధపడ్డాను. ఈ సినిమా చేయడం వల్ల నా లైఫ్‌, ఫ్రీడమ్‌ వాల్యూ ఏంటో తెలిసింది. మందు శరీరానికే కానీ మనసుకు కాదనే విషయం కూడా తెలిసింది. వీల్‌ చెయిర్‌లో ఉండేవారు డిసెబుల్డ్‌ పర్సన్‌ కారు, డిఫరెంట్‌ ఎబుల్డ్‌ పర్సన్‌. వారిని చిన్న చూపు చూసేవారికి పాజిటివిటీతో ఉండాలి, ఉండే ఏదైనా సాధించవచ్చునని చెప్పే ఒక మెసేజ్‌లాంటి మూవీ ఇది. కార్తీ చెల్లెల్ని తన చెల్లెలుగా భావించి వారి సమస్యను తీర్చి సందర్భంలోని ఎమోషన్‌, అదే సన్నివేశంలో నేను చెల్లెలి పెళ్లి కోసం పెయింటింగ్స్‌ వేసుకోవాలంటూ కార్తీ చేసే కామెడి, అలాగే నా కాళ్లపై కార్తీ వేడినీరు పోసే సీన్‌ ఇలా చాలా మనసుకు నచ్చే బ్యూటీఫుల్‌ సీన్స్‌ ఎన్నో ఉన్నాయి. నా మనసుకు హత్తుకున్నాయి. ఇలాంటి సినిమాల్లో నటిస్తే ఓ వ్యక్తిలో చాలా మార్పు వస్తాయి. నాలో కూడా స్పిరుచువల్‌, ఆలోచనావిధానంలో ఇలా మానసికంగా  మార్పులు వచ్చాయి. ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాను. నాకు, కార్తీకి మధ్య రియల్‌ లైఫ్‌లో మంచి రిలేషన్‌ ఏర్పడిరది. ఆ సన్నిహితమే తెరపై కూడా ఆవిష్కృతమైంది. ఈ సినిమాలో హీరోస్‌, స్టార్స్‌ లేరు. కేవలం పాత్రలు మాత్రమే కనపడుతున్నాయి. కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాను. ఇలాంటి మంచి చిత్రాన్ని ఆదరించి మాలో నమ్మకాన్ని పెంచారు'' అన్నారు.

వంశీపైడిపల్లి మాట్లాడుతూ.. ''ఈ సినిమా చేయడం ఎమోషనల్‌గా అనిపించింది. అందరికీ నచ్చే సినిమా చేస్తున్నామని తెలుసు. అయితే ఈ సినిమా నాగార్జునగారి మనసుకు చాలా దగ్గరైంది. అందుకే ఆయన మొదటి నుండి మమ్మల్ని ఎంకరేజ్‌ చేస్తూ వచ్చారు. జీవితంలో తోడు అవసరమని తెలియజెప్పే చిత్రమిది. ఇంత మంది జీవితాలపై ఇంపాక్ట్‌ చేస్తున్న సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమా చేయడం వల్ల మా రెస్పాన్సిబిలిటీనీ పెంచడమే కాకుండా మాలో నమ్మకాన్ని పెంచింది'' అన్నారు.

ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ.. ''నాగార్జునగారు, వంశీగారు నిర్ణయం తీసుకోవడమే సినిమా రూపకల్పనకు మొదటి మెట్టు. పాసిబిలిటీ, హ్యుమన్‌ రిలేషన్స్‌ గురించి తెలియజేసే చిత్రమిది. నాగార్జునగారు సినిమా మేకింగ్ లో బాగా గైడ్‌ చేశారు. ఈ సినిమాలో కార్తీ వేసిన పెయింటింగ్‌ను వేం వేసి ఆ మొత్తానికి కొంత మొత్తాన్ని యాడ్‌ చేసి చాలెంజర్స్‌ ఆన్‌ వీల్స్‌ అనే అసోసియేషన్‌ను అందజేస్తాం'' అన్నారు.

ఈ కార్యక్రమంలో సుజి, మహిత్‌ నారాయణ, పద్మప్రియ, పద్మ, స్వాతి, తోయజాక్షి సహా పువురు వీల్‌ చెయిర్‌ ఫ్రెండ్స్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.సుజి, డా.పూజ ఆధ్వర్యంలో చాలెంజర్స్‌ ఆన్‌ వీల్‌ అనే అసోసియేషన్‌ను ప్రారంభించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs