'రాజావారి మిత్రబృందం' లఘు చిత్రం విశేషాలు!
పటమటలంక నవీన్, ఈశ్వర్ రెడ్డి, సుహాస్, నిశాంత్ ప్రథాన పాత్రల్లో సినీ అవుట్ లుక్ క్రియేషన్స్ బ్యానర్ పై పటమటలంక ప్రవీణ్ దర్శకత్వంలో కళ్యాన్ కుమార్ నిర్మిస్తోన్న లఘు చిత్రం 'రాజావారి మిత్రబృందం'. ఈ సినిమాను ఈ నెలలో యూట్యూబ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..
దర్శకుడు పటమటలంక ప్రవీణ్ మాట్లాడుతూ.. ''హరిశ్చంద్రుడు లాంటి నీతిమంతుడు నేటి యుగంలో ఉంటే ఎలా ఉంటుందనేదే సినిమా కథ. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులను చాలా ఫన్నీగా ప్రెజంట్ చేశాం. గంటశాల విశ్వనాథ్ అందించిన మ్యూజిక్ కథను ఇంకాస్త ఎలివేట్ చేసింది. సినిమాలో ఒక పాట మాత్రమే ఉంటుంది. సుభాష్ మంచి లిరిక్స్ అందించారు. ఈ నెలలో యూట్యూబ్ లో మా షార్ట్ ఫిలిం ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
నిర్మాత కళ్యాన్ కుమార్ మాట్లాడుతూ.. ''నవీన్ చెప్పిన కథ నచ్చడంతో షార్ట్ ఫిలిం చేయాలని భావించాను. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా ఇది. అవుట్ పుట్ బాగా వచ్చింది'' అని చెప్పారు.
గంటశాల విశ్వనాథ్ మాట్లాడుతూ.. ''కమర్షియల్ కథ అనిపించింది. కళ్యాన్ గారు కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన ఇలానే మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: గంటశాల విశ్వనాథ్, ఎడిటర్: చోటు చెర్రీ, ఫోటోగ్రఫీ: దీపు రెడ్డి, లిరిక్స్: సుబాష్, డాన్స్: సాయి క్రిష్, నిర్మాత: కళ్యాన్ కుమార్, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: పటమటలంక నవీన్.