CJ Advs
>బాలకృష్ణ కోలా, వామికా జంటగా బీప్‌టోన్ స్టూడియోస్, శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నన్ను వదిలి నీవు పోలేవులే'. డైరెక్టర్ శ్రీరాఘవ ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే అందించారు. గీతాంజలి శ్రీరాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోలా భాస్కర్, కంచర్ల పార్థసారధి నిర్మాతలు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రియల్ 1న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
>ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కోలా భాస్కర్, కంచర్ల పార్థసారధి మాట్లాడుతూ..' శ్రీరాఘవగారి స్నేహానికి ఇచ్చిన గౌరవం ఈ సినిమా. ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమాని రూపొందించాము. ఇప్పటికే సంగీత దర్శకుడు అమృత్ స్వరపరిచిన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పాటలు సక్సెస్ అయినట్లే సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం మాకుంది. శ్రీరాఘవ గారి కథ, స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు గీతాంజలి శ్రీరాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ అలరిస్తుంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రియల్ 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము..' అని అన్నారు.
>బాలకృష్ణ కోలా, వామికా, కళ్యాణ్ నటరాజన్, శరణ్, పార్వతినాయర్ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి పాటలు: అనంత శ్రీరామ్, కూర్పు: రూకేష్, మాటలు: వి. కృష్ణతేజ, నృత్యం: కళ్యాణ్, సంగీతం: అమృత్, కెమెరా: శ్రీధర్, కథ-స్క్రీన్‌ప్లే: శ్రీరాఘవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. మణికుమార్,
>నిర్మాతలు: కోలా భాస్కర్, కంచర్ల పార్థసారధి
>దర్శకత్వం: గీతాంజలి శ్రీరాఘవ