రంజిత్, పలక్ లల్వాని జంటగా త్రికోటి దర్శకత్వంలో భరత్ నిర్మాతగా సోమ్మి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా.. బొత్స సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
నిర్మాత భరత్ మాట్లాడుతూ.. ''ఏప్రిల్ 4 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. సినిమా కథ నచ్చడంతో మా తమ్ముడ్ని హీరోగా పెట్టి సోమ్మి ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ.. ''ఇది నా రెండో సినిమా. నా మొదటి సినిమా 'దిక్కులు చూడకు రామయ్య' ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఈ సినిమా లవ్, యాక్షన్ ఎంటర్టైనర్. నాలుగైదు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. నన్ను సపోర్ట్ చేస్తోన్న నిర్మాతకు థాంక్స్'' అని చెప్పారు.
హీరో రంజిత్ మాట్లాడుతూ.. ''మా ప్రొడక్షన్ లో చేస్తోన్న మొదటి సినిమా. లెజెండ్ సినిమాకు మాటలు అందించిన రత్నం గారు ఈ సినిమాకు కూడా కథ, మాటలు అందించారు. దర్శకుడు త్రికోటి గారి దగ్గర చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను'' అని చెప్పారు.
పలక్ లల్వాని మాట్లాడుతూ.. ''పాజిటివ్, ఎనర్జిటిక్ టీం తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. నాకు కథ బాగా నచ్చింది. అదే నమ్మకంతో సినిమా చేయడానికి అంగీకరించాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు, ఆర్ట్ డైరెక్టర్: మురళి కొండేటి, నిర్మాత: భరత్ సోమి, దర్శకుడు: త్రికోటి.