సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ జంటగా అని కన్నెగంటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'రన్'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లరి నరేష్ బిగ్ సీడీను ఆవిష్కరించి మొదటి కాపీను రాజ్ తరుణ్ కు అందించారు. ఏ.ఎం.రత్నం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ''ఈ చిత్ర నిర్మాతలు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడం గొప్ప విషయం. ఎందరో టెక్నీషియన్స్ బ్రతుకుతారు. ఈ సినిమా బ్యానర్ కూడా నా సొంత బ్యానర్ లాంటిదే. కొత్తగా చేయాలి, సినిమాలో కొత్తదనంలో ఉండాలని కోరుకునేవాడు సందీప్. తమిళం, మలయాళంలో లానే తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. బాబీ సింహా గారు ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఏ షేడ్స్ ఉన్న పాత్రలో అయినా.. నటించగలరు. అని కన్నెగంటి హార్డ్ వర్క్ చేసే డైరెక్టర్. అనీషాకు ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలి. సాయి కార్తిక్ గారు ఇలానే మంచి సంగీతాన్ని అందిస్తూ ఉండాలి'' అని చెప్పారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ''లాస్ట్ ఇయర్ గుడ్ టైం, బ్యాడ్ టైం రెండు చూశాను. అనిల్ సుంకర గారు నాకు నాలుగు సంవత్సరాలుగా తెలుసు. నాకు మంచి శ్రేయోభిలాషి. 'ప్రస్థానం' సినిమా చూసిన తరువాత నాతో సినిమా చేయాలనుకున్నాడు. కాని ఇన్ని రోజులకు కుదిరింది. సినిమా బాగా వచ్చింది. అనీషాతో వర్క్ చేయడం కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. సాయి కార్తిక్ మంచి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు'' అని చెప్పారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''సంవత్సరం క్రితం తమిళంలో ఈ సినిమా చూసి తెలుగులో సందీప్ హీరోగా చేయాలనుకున్నాను. కాని ఆ సమయంలో రైట్స్ మా దగ్గర లేవు. సడెన్ గా సినిమా రైట్స్ మా చేతికి వచ్చాయి. వెంటనే సుధాకర్ సినిమా చేసేద్దామని చెప్పాడు. సందీప్ ని పిలిచి హీరోగా నటించమని అడిగాం. తెలుగులో ఈ సినిమాను మేము రీమేక్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అని కన్నెగంటి
అని కన్నెగంటి మాట్లాడుతూ.. ''రెండు సంవత్సరాల క్రితం తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. నాకు కూడా బాగా నచ్చిన సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమా అవుట్ పుట్ మంచి క్వాలిటీతో రావడానికి కారణం కెమెరామెన్. సాయి కార్తిక్ చాలా ఫాస్ట్ గా ట్యూన్స్ ఇచ్చాడు. పాటలు విన్న వారందరూ బావున్నాయని చెబుతున్నారు. బాలాజీ గారు రాసిన మూడు పాటలు అధ్బుతంగా ఉంటాయి. సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్ చాలా బావుంది. ఇదివరకు తమిళంలో 'రన్' అనే పేరుతో ఓ సినిమా చేశాను. చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా మంచి హిట్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
వీరుపోట్ల మాట్లాడుతూ,, ''ఇదొక టైమ్లీ మూవీ అని నా ఫీలింగ్. ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తే చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది. సినిమా టీజర్ చాలా బావుంది. సందీప్ కిషన్ తో నేను సినిమా చేయాల్సింది కాని కుదరలేదు. త్వరలో ఖచ్చితంగా తనతో సినిమా చేస్తాను'' అని చెప్పారు.
నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''టీజర్ చాలా బావుంది. ఈ సినిమాతో అనిల్ గారికి మంచి టైం మొదలుకానుంది. ఏకకాలంలో ఐదు సినిమాలను నిర్మించడం అంత సులువైన పని కాదు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. ''సందీప్ కిషన్ ఎప్పుడు సినిమాలు కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాతో తనకు మంచి టైం మొదలవ్వాలి. సినిమా మంచి విజయాన్ని సాదించాలి'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దశరథ్, జెమినీ కిరణ్, కాశి విశ్వనాథ్, సుధాకర్ చెరుకూరి, క్రాంతి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.