ఆశిష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శ్రుతి మోల్, మనాలి ప్రథాన పాత్రల్లో రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 11న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ''అశోక్ రెడ్డి సినిమాల మీద ప్యాషన్ తో తన ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకు వచ్చాడు. ఎంతో కష్టపడి సినిమా చేశాడు. ఇరవై ఏళ్ళ క్రితం అన్ని ఊర్లలో ఇంటి గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాసేవారు. కొన్ని ప్రాంతాల ప్రజలైతే దయ్యానికి భయపడి ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇలాంటి కాన్సెప్ట్ ను కథగా తీసుకొని సినిమా చేశారు. మార్చి 11న సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు అందరూ ఆదరించాలి కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ''1980 లలో 'ఓ స్త్రీ రేపురా' అనే మాట బాగా వినిపించేది. గోడ మీద అలా రాస్తే దయ్యం వెళ్ళిపోతుందని అందరూ భావించేవారు. ఈ సినిమాలో దయ్యం కథ చెబుతూ ఉంటుంది. హారర్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా ఈ సినిమా నిలుస్తుంది'' అని చెప్పారు.
ఆశిష్ గాంధి మాట్లాడుతూ.. ''సినిమా అవుట్ పుట్ చూసిన తరువాత మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.
పవన్ మాట్లాడుతూ.. ''నిజమా..? కల్పితమా..? అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వంశీ, శ్రుతి మోల్, మనాలి, జి.వి తదితరులు పాల్గొన్నారు.
వైవా హర్ష, స్వప్నిక, షాన్, వీరబాబు, శ్యాంసుందర్, సోనాల్ ఝాన్సీ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్: జి.వి, ఎడిటర్: రామాంజనేయ రెడ్డి, కెమెరా: సిద్ధం మనోహర్, దేవర హరినాథ్, సాహిత్యం: సుభాష్ నారాయణ్, పవన్ రాచేపల్లి, స్క్రిప్ట్, డైలాగ్స్: పవన్ రాచేపల్లి, కో ప్రొడ్యూసర్: ప్రవీణ్ సాగి, కథ, నిర్మాత, దర్శకత్వం: అశోక్ రెడ్డి.