Advertisement
Google Ads BL

'న‌న్ను వ‌ద‌లి నీవు పోలేవులే' పాటలు విడుదల!


బాల‌కృష్ణ కోలా, వామికా జంట‌గా బీప్‌టోన్ స్టూడియోస్, శ్రీ కామాక్షి మ‌ల్టీమీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'న‌న్ను వ‌దిలి నీవు పోలేవులే'. న‌టించారు. శ్రీరాఘ‌వ ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించారు. గీతాంజ‌లి శ్రీరాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి కోలా భాస్క‌ర్‌, కంచ‌ర్ల పార్థ‌సార‌థి నిర్మాత‌లు. అమృత్ సంగీతాన్ని అందించిన  ఈ సినిమా పాట‌ల‌ను హైద‌రాబాద్‌లోని లెమ‌న్ ట్రీ హోట‌ల్లో ఆదివారం రాత్రి విడుద‌ల చేశారు. తొలి సీడీని హీరోయిన్ వేద విడుద‌ల చేశారు. తొలి సీడీని చిత్ర క‌థానాయిక వామిక అందుకున్నారు.

Advertisement
CJ Advs

కోలా భాస్క‌ర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా తీశాం. అందుకు నాకు వెన్నుద‌న్నుగా ఉన్న వ్య‌క్తి పార్థ‌సార‌థిగారు. అంతటి పాజిటివ్ వ్య‌క్తిని నేను ఎప్పుడూ చూడ‌లేదు. నాకు ఆయ‌న అందించిన స‌హ‌కారం మ‌రువ‌లేనిది. అలాగే ఎడిట‌ర్‌గా నా తొలి నాళ్ళ‌లో న‌న్ను ప్రోత్స‌హించిన నాగేశ్వ‌ర‌రావుగారిని కూడా మ‌రువ‌లేను. ఇక సినిమా విషయానికి వస్తే, శ్రీరాఘ‌వ‌గారికి సినిమాయే లోకం. ఆయ‌న నా ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చిన వేల్యూ ఈ సినిమా. ఆయ‌న‌తో సినిమా చేయ‌డ‌మంటే పెద్ద సాహ‌సం చేసిన‌ట్టు. ఆయ‌న‌లో ఉన్న క్రియేట‌ర్‌ని ఎవ‌రూ కంట్రోల్ చేయ‌లేరు. పర్ఫెక్ష‌న్ కోసం తాప‌త్ర‌య‌ప‌డే క్రియేట‌ర్ ఆయ‌న‌. ప్ర‌తి రూపాయినీ క్వాలిటీ కోస‌మో ఖ‌ర్చుపెట్టే డైర‌క్ట‌ర్ ఆయ‌న‌. ఈ సినిమాను మేం తీసే తీరు చూసి చాలా మంది ఓ స్టేజ్‌లో చాలు అని కూడా హెచ్చ‌రించారు. కానీ ఎడిట‌ర్ తీస్తున్న సినిమా బ‌యటికి వ‌చ్చిన త‌ర్వాత అంద‌రి మ‌న్న‌న‌లు పొందాలి అని ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా చేశాం. మా అబ్బాయి పేరును క్రిష్ అని పెడ‌దామ‌ని షూటింగ్ స‌మ‌యంలో చాలా సార్లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డాం. అయితే శ్రీరాఘ‌వ‌గారికి ఆ పేరు ఎందుకో న‌చ్చ‌లేదు. మా అబ్బాయి బాల‌కృష్ణ‌గారికి పెద్ద ఫ్యాన్‌. వాడికి ఆయ‌న పేరంటే చాలా ఇష్టం. అందుకే కోలా బాల‌కృష్ణ అనే పేరునే ఇష్ట‌ప‌డ్డాడు. మా అబ్బాయి, వామి జంట మెప్పిస్తుంది'' అని అన్నారు.  

హీరో కోలా బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను చేసిన శ్రీరాఘ‌వ‌గారికి, గీతాంజ‌లిగారికి, మా నాన్న‌గారికి, పార్థ‌సార‌థిగారికి చాలా థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించాడు. నాకు మంచి ఫ్రెండ్‌. వామిక చక్క‌గా న‌టించింది. ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అవుతుంద‌ని, అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను'' అని అన్నారు.

సీవీ రెడ్డి మాట్లాడుతూ.. ''కోలా భాస్క‌ర్ గారు ఎడిటింగ్‌లో గురువు. నేను ఆయ‌న ద‌గ్గ‌ర ఎడిటింగ్ నేర్చుకున్నాను. ద‌ర్శ‌కుడు అనే వాడికి ఎడిటింగ్ తెలిసి ఉండాలి. కోలా భాస్క‌ర్ భ‌విష్య‌త్తులో ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఆకాంక్షిస్తున్నా. కోలా భాస్క‌ర్ వాళ్ళ‌బ్బాయిని హీరోగా పెట్టి సినిమాను డైర‌క్ట్ చేయాల‌ని కూడా ఆశిస్తున్నా'' అని అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''కోలాభాస్క‌ర్‌గారు చాలా సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఆయన గురించి అందరికీ తెలుసు. ఈ సినిమాను ఒక‌టిన్న‌రేళ్ళు క‌ష్ట‌ప‌డి ఈ సినిమాను చేశారు. మంచి లవ్ సబ్జెక్ట్. త‌మిళంలో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ హీరో డ‌బ్బింగ్ చెబుతున్న‌ప్పుడు విన్నాను. చాలా మంచి వాయిస్ అత‌నిది. త‌ప్ప‌కుండా సినిమా స‌క్సెస్ కావాల‌ని ఆశిస్తున్నాను. టీజ‌ర్ చాలా బావుంది. పాట‌లు త‌ప్ప‌కుండా యువ‌త‌ను ఆక‌ట్టుకుంటాయి'' అని చెప్పారు.

అర్చ‌న మాట్లాడుతూ.. ''అమృత్ పాట‌లు బావున్నాయి. శ్రీరాఘ‌వ‌గారు ఈ సినిమాకు అమృత్‌ను ఎంపిక చేసుకున్నారంటేనే అత‌నిలో ఉన్న పొట‌న్షియాలిటీ ఏంటో అర్థ‌మైపోతుంది. అరేంజ్ మేరేజ్ పాట‌, ఇంకో రొమాంటిక్ సాంగ్ నాకు చాలా బాగా న‌చ్చాయి. ట్రైల‌ర్లు బావున్నాయి. కోలా బాల‌కృష్ణ కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. పోస్ట‌ర్లు చూస్తుంటేనే త‌ను ఎంత బాగా న‌టించాడో అర్థ‌మ‌వుతుంది'' అని చెప్పారు.

బి.ఎ.రాజు మాట్లాడుతూ.. ''భాస్క‌ర్ ఎడిట‌ర్‌గా స‌క్సెస్ ఫుల్ అయ్యారు. ఆయన తనయుడు హీరోగా నటించిన ఈ సినిమా త‌మిళంలో పెద్ద స‌క్సెస్ అయింది. తెలుగులోనూ పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

కృష్ణ‌తేజ మాట్లాడుతూ.. ''రాఘ‌వ‌గారి సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాకు మాటలు రాసేటప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. యువ‌త త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా. హీరో, హీరోయిన్ల జంట త‌ప్ప‌కుండా యువ‌త‌కు న‌చ్చుతుంది.. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ సినిమా మౌత్‌టాక్‌తో హిట్ అవుతుంది'' అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ''ముందు కోలా భాస్కర్ గారికి అభినందనలు. హీరో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. శ్రీరాఘ‌వ చేసిన '7/  జి బృందావ‌న్ కాల‌నీ' క‌న్నా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది'' అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ మాట్లాడుతూ.. ''తెలుగు, త‌మిళ్‌లో శ్రీరాఘ‌వ‌గారితో, గీతాంజ‌లిగారితో ఈ సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. టాలీవుడ్‌లోకి ఈ సినిమాతో ఎంట‌ర్ కావ‌డం ఆనందంగా ఉంది. కోలా భాస్క‌ర్ గారు ఇచ్చిన అవ‌కాశాన్ని మ‌ర్చిపోలేను. అనంత‌శ్రీరామ్ చాలా బాగా లిరిక్స్ రాశారు. హీరో నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. చాలా వండ‌ర్‌ఫుల్‌గా పెర్ఫార్మెన్స్ చేశాడు. వామికా చ‌క్క‌గా న‌టించింది. అందరికీ ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.

శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ''మా భ‌లే మంచి రోజు సినిమాలో వామిక నాయిక‌గా న‌టించింది. ఈ సినిమాలోని హీరో నాకు జూనియ‌ర్‌. శ్రీరాఘ‌వ‌గారితో తొలి సినిమా చేశాడు. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

వామిక మాట్లాడుతూ.. ''తెలుగులో భ‌లే మంచి రోజు హిట్ నా తొలి సినిమా అది పెద్ద విజయాన్ని సాధించింది. రెండో సినిమాగా న‌న్ను వ‌ద‌లి నీవు పోలేవులే విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా ఉంది. శ్రీ రాఘవగారు వర్క్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు. ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గీతాంజ‌లి చాలా కూల్ డైర‌క్ట‌ర్‌.. కోలా బాల‌కృష్ణ, నేను క‌లిసి చేసిన స‌న్నివేశాల‌న్నీ యువ‌త‌కు చాలా బాగా న‌చ్చుతాయ‌నే న‌మ్మ‌కం ఉంది. నేటి ట్రెండ్‌కి త‌గ్గ సినిమా ఇది. కోలాభాస్క‌ర్‌గారి నిర్మాణ విలువ‌లు చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు'' అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కాళేశ్వరరావు, అమర్ నాథ్, కిషోర్, అనంతశ్రీరాం, పూనం కౌర్, జ్యోతి తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు.

క‌ల్యాణ్ న‌ట‌రాజ‌న్‌, శ‌ర‌ణ్‌, పార్వ‌తి నాయ‌ర్ ఇత‌ర పాత్ర‌ధారులుగా నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే: శ్రీ రాఘవ, మ్యూజిక్: అమ్రిత్, సినిమాటోగ్రాఫర్: శ్రీధర్, ఎడిటర్: రాకేష్, సాహిత్యం: అనంత్ శ్రీరాం, నిర్మాతలు: కోలా భాస్కర్, కంచెర్ల పార్థసారథి, దర్శకత్వం: గీతాంజలి శ్రీరాఘవ.

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs