Advertisement
Google Ads BL

'శౌర్య' మూవీ సక్సెస్ మీట్!


మంచు మనోజ్ రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మించిన చిత్రం 'శౌర్య'. మార్చి 4న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ''దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్ లలో సినిమాను రిలీజ్ చేశాం. ప్రతి చోట నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తిరుపతికి వెళ్లి అక్కడ థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూసిన తరువాత చాలా సంతోషంగా అనిపించింది. ఇండస్ట్రీలో సినిమాను జడ్జ్ చేసే నాధుడే లేదు. ప్రేక్షకులు మాత్రం సినిమాను జడ్జ్ చేయగలరు. సినిమాకు ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను ప్రోత్సహించాలని ప్రకాష్ రాజ్ గారు తక్కువ రెమ్యునరేషన్ కే పని చేశారు. ఇలాంటి టీం తో మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ.. ''డిఫరెంట్ అటెంప్ట్ తో ఈ సినిమాను ప్రయత్నించాం. ప్రతి ఒక్కరు సినిమా చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలో నటించే అవకాసం ఇచ్చిన దశరథ్ గారికి థాంక్స్ చెప్పాలి. మా నాన్నగారితో కలిసి సినిమాలో నటించినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ కలిగిందో.. ప్రకాష్ రాజ్ గారితో కలిసి పని చేసినప్పుడు కూడా అలానే అనిపించింది. శివకుమార్ గారు ఎంతో ప్యాషనేట్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. పైరసీను ఎంకరేజ్ చేయొద్దు'' అని చెప్పారు.

దశరథ్ మాట్లాడుతూ.. ''మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తరువాత అన్ని ఫోన్ కాల్స్ ఈ సినిమాకే వచ్చాయి. సోషల్ మీడియాలో అందరు సినిమా బావుందని చెబుతున్నారు. ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా'' అని చెప్పారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ''నేను కాన్షియస్ గా ఎంచుకున్న కథ ఈ శౌర్య. దశరథ్ ఇప్పటివరకు తీసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. ఇలాంటి జోనర్ ను ఆయన ఇప్పటివరకు టచ్ చేయలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తరువాత ఈ కథ తీసుకొని దశరథ్ నా దగ్గరకు వచ్చాడు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను. మనోజ్ మంచి ఎనర్జిటిక్ యాక్టర్. తనకు రావాల్సిన ఫేం ఇంకా ఎందుకు రావట్లేదో అర్ధం కావట్లేదు. ఏ పాత్రలో అయిన మౌల్డ్ అయ్యి నటించగలడు. తనకు సెపరేట్ బాడీలాంగ్వేజ్ ఉంది. తనకోసం నేను ఈ సినిమాలో నటించాను. మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. నేత్ర క్యారెక్టర్ లో రెజీనా చక్కగా నటించింది. కొన్ని వెబ్ సైట్లలో 2, 2.25 రేటింగ్స్ ఇచ్చారు. సినిమాల్లో మనం పండితులమేమి కాదు కదా.. ఆ రివ్యూలను చూసి సినిమాకు వెళ్ళే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి కొత్త ప్రయోగాలు చేసినపుడు ప్రోత్సహిస్తేనే కొత్త సినిమాలు వస్తాయి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి స్టంట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్ ప్లే: గోపు కిషోర్, రచన: గోపి మోహన్;, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, నిర్మాత: శివకుమార్ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs