Advertisement
Google Ads BL

'శ్రీశ్రీ' కి మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌!


సూపర్‌స్టార్‌ కృష్ణ కథానాయకుడిగా, శ్రీమతి విజయనిర్మల కథానాయికగా కలిసి నటంచిన ఎస్‌.బి.ఎస్‌. ప్రొడక్షన్స్‌ సంస్థ..దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో యువ నిర్మాతలు శ్రీ సాయిదీప్‌ చాట్ల, వై. బాలు రెడ్డి, షేక్‌ సిరాజ్‌లు నిర్మించిన చిత్రం 'శ్రీశ్రీ'. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ మధ్యనే విడుదల అయిన ఆడియోకి సంగీత ప్రియుల వద్ద నుండి మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌: 

ఈ చిత్రం గురించి దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ.. ''హీరో కృష్ణ స్వర్ణోత్సవ చిత్రంగా మేము నిర్మించిన శ్రీశ్రీ చిత్రానికి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఇది స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ కార్యక్రమం శబ్ధాలయా థియేటర్‌లో ఇటీవల జరిగింది. ఇందులో డీసీపీ పాత్రను సుధీర్‌బాబు అద్భుతంగా పోషించాడు. పతాక సన్నివేశాల్లో వచ్చే ఈ పాత్ర అన్ని తరగతుల వారిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలై మంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. శివరాత్రికి ఫస్ట్‌కాపీ సిద్ధం అవుతున్న శ్రీశ్రీ చిత్రాన్ని సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 3 వారంలో విడుదల చేసేందుకు మా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు...'' అని చెప్పారు. 

చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రీ సాయిదీప్‌ చాట్ల మాట్లాడుతూ.. ''మా అభిమాన కథానాయకుడైన సూపర్‌స్టార్‌ కృష్ణగారితో మేము నిర్మించిన 'శ్రీశ్రీ' చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. దర్శకులు ముప్పలనేని శివ ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుండి కాపీ వచ్చేంత వరకు అహర్నిశలు శ్రమించి దీనిని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారు. ఆయన మాకు చెప్పిన దానికన్నా 100 శాతం ఇంకా బాగా తీశారు. ఇది మా హీరో కృష్ణగారికి ఓ అపురూపమైన చిత్రం అవుతుంది. ఇక 'శ్రీశ్రీ' చిత్రాన్ని మార్చి మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..'' అని అన్నారు. 

సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, నరేష్‌, సాయికుమార్‌, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్‌, తోటపల్లి మధు, దేవదాస్‌ కనకాల, మురళీశర్మ, కునాల్‌ కౌశిక్‌, శ్రీమతి అనితాచౌదరి, సోఫియా మొదలగువారు నటించిన ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా పతాక సన్నివేశాల్లో హీరో సుధీర్‌బాబు ఒక ప్రత్యేకమైన పాత్రను చేశారు. 

ఈ చిత్రానికి మాటలు: రామ్‌ కంకిపాటి, కథ: రమేష్‌ డియో ప్రొడక్షన్స్‌, ఫైట్స్‌: నందు, సంగీతం: ఇఎస్‌. మూర్తి(గమ్యం ఫేమ్‌), సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల, ఆర్ట్‌: అశోక్‌, ఎడిటింగ్‌: రమేష్‌, కాన్సెఫ్ట్‌ రైటర్‌: కళ్యాణ్‌జీ, కో-డైరెక్టర్‌: రమేష్‌రాజా.ఎమ్‌., అసోసియేట్‌ డైరెక్టర్స్‌: విజయ్‌భాస్కర్‌. కె, నిమ్మకాయల కోఠి, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: తాండవ కృష్ణ, నారాయణ, నిర్మాతలు: శ్రీ సాయిదీప్‌ చాట్ల, వై. బాలు రెడ్డి, షేక్‌ సిరాజ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ముప్పలనేని శివ.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs