Advertisement
Google Ads BL

'క్షణం' అందరినీ ఆకట్టుకుంటోందట!


అడవి శేష్, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రల్లో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'క్షణం'. ఇటీవల విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

Advertisement
CJ Advs

రానా మాట్లాడుతూ.. ''ఈ సినిమా చూసిన తరువాత నేను కేవలం సినిమాల్లో ఉన్నవాడిని మాత్రమే కాదని సినిమా లవర్ ని అనే విషయం గుర్తొచ్చింది. నేను, బన్నీ సినిమా చూడాలని వెళ్లాం. అసలు సినిమాలో ఏ ట్విస్ట్ నేను ఊహించలేకపోయాను. థ్రిల్లర్ ఫార్మాట్ లో తెలుగుదనం ఉంటుంది. ప్రతి సన్నివేశానికి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

లక్ష్మీ మంచు మాట్లాడుతూ.. ''సినిమా చూస్తున్నంత సేపు తెలుగు సినిమాల మాత్రం అనిపించలేదు. చాలా ఎగ్జైట్ అయ్యాను. సినిమాలో మ్యూజిక్, ప్రేమకథ ప్రతీది ప్రేక్షకులకు నచ్చుతుంది. వైజాగ్ ను సినిమాలో చాలా బాగా చూపించారు'' అని చెప్పారు.

ప్రకాష్ కోవెలమూడి మాట్లాడుతూ.. ''సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అసలు సినిమా అంత బావుంటుందని ఊహించలేదు. రవికాంత్ మొదటిసారి డైరెక్ట్ చేసినట్లుగా లేదు. చాలా మెచ్యూర్డ్ గా చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్. తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ను తీసుకురాగలిగారు'' అని చెప్పారు.

అడవి శేష్ మాట్లాడుతూ.. ''చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. బన్నీ, రానా, రకుల్ సినిమా చూసిన తరువాత పెర్సనల్ గా పిలిపించి మాట్లాడారు. పివిపి గారు సినిమా చూసి కొన్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదు. మొదట నుండి ఆయన మాకు సపోర్ట్ చేశారు. ఆయన ఉండడం వలన ఈ సినిమా ఇంత హిట్ అయింది'' అని చెప్పారు.

పివిపి మాట్లాడుతూ.. ''మూవీ లవర్స్ కు సినిమా బాగా నచ్చుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో పాటు ప్రేక్షకుల నుండి కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. త్వరలోనే మా బ్యానర్ లో రానా హీరోగా 'గాజి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాం'' అని చెప్పారు.

రవికాంత్ పేరెపు మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీ నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బన్నీ, రానా, ప్రకాష్ గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. పివిపి ప్లాట్ ఫాం లేకపోతే సినిమా విజయం సాధ్యమయ్యేది కాదు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో షానిల్ డియో, శ్రీ చరణ్, అనసూయ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs