దుగ్గిన్ సమర్పణలో శివకృతి క్రియేషన్స్ బ్యానర్ పై రుద్ర, వెన్నె, సంజయ్, బంగారం ప్రధానతారాగణంగా రూపొందిన చిత్రం 'వీరి వీరిగుమ్మడిపండు'. ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కెల్లం కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా.. దర్శకుడు సాగర్ తమ సినిమా విశేషాల గురించి ప్రేక్షకులతో ముచ్చటించారు.
''దాదాపు 63 మంది కొత్తవాళ్ళందరూ కలిసి పనిచేసిన చిత్రమిది. ఇటీవల ఔట్ పుట్ చూసుకున్నాం. చాలా సంతృప్తికరంగా వచ్చింది. ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాల్లో ఒక బెంచ్ మార్క్ చిత్రంగా ''వీరి వీరి గుమ్మడి పండు'' నిలిచిపోతుంది. సినిమా మొదలయిన 15 నిమిషాల్లోనే కథలోకి వెళ్ళిపోతాం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక ఇరవై నిమిషాల పాటు ఉంటుంది. మొదటి భాగంలో సినిమాలో దెయ్యం ఉందని తెలుస్తుంది. రెండో భాగంలో ఆ దెయ్యం ఎవరిలో ఉందనే అంశాలతో సినిమా నడుస్తుంది. క్లైమాక్స్ కూడా ఇరవై నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో మొత్తం 5 పాటలుంటాయి. ప్రతి పాట కథలో భాగంగా ఉంటుంది. నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర పని చేయలేదు. కిరణ్ కుమార్ కు ఈ సినిమా కథ చెప్పగానే నేనే నిర్మిస్తానని ముందుకొచ్చారు. చిన్న సినిమాల్లో ఇదొక కమర్షియల్ ఫిలిం. సినిమాను మొత్తం 75 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం'' అని చెప్పారు.