Advertisement
Google Ads BL

హైదరాబాద్ లోనే సెటిల్ అవుతా: జిబ్రన్!


'రన్ రాజా రన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రన్. ఆ తరువాత 'జిల్' సినిమాకు కూడా పని చేశాడు. రెండు హిట్ ఆల్బమ్స్ అవ్వడంతో తెలుగులో మంచి మంచి అవకాశాలను చేజిక్కించుకుంటున్నాడు. ఈ విషయాల గురించి జిబ్రన్ విలేకర్లతో ముచ్చటించారు.

Advertisement
CJ Advs

''రన్ రాజా రన్' లాంటి క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చిన నా నుండి ఓ మాస్ ఆల్బం రాబోతుంది. వెంకీ, మారుతి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు మెలోడియస్ మ్యూజిక్ తో పాటు మాస్ మ్యూజిక్ అందిస్తున్నాను. సినిమాలో మొత్తం 5 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటుంది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. వెంకటేష్, మారుతీ లు పాటలు బావున్నాయని చెప్పినపుడు చాలా సంతోషపడ్డాను. మొదట వెంకీ గారితో సినిమా అనగానే టెన్షన్ పడ్డాను. కమల్ హాసన్ గారిచ్చిన ఒక పార్టీలో వెంకీ సర్ ను కలిసాను. ఆయన వెంటనే హగ్ చేసుకున్నారు. దాంతో నాలో భయం పోయింది. చాలా కూల్ గా అయన ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాకు సారంగి, నాథశ్వరమ్ లాంటి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాను. ఈ సినిమా తరువాత ప్రభాస్, సుజీత్ కాంబినేషన్ లో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో వస్తోన్న సినిమాకు మ్యూజిక్ చేయడానికి సైన్ చేశాను. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ కు ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చింది. ఆ సినిమా పాటలు కూడా ప్రపంచం అన్ని చోట్ల మారు మ్రోగుతున్నాయి. ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. కాబట్టి హై స్టాండర్డ్స్ లో మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మా వైఫ్ విజయవాడకు చెందిన అమ్మాయి. ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటుంది. సో.. నేను కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాను. ముందుగా ఒక స్టూడియో ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను మ్యూజిక్ అందించిన 'విశ్వరూపం' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నిర్మాతలు డేట్ అనౌన్సు చేయాలి. అలానే తమిళంలో చెన్నై టు సింగపూర్ అనే సినిమాకు విక్రమ్ గారు హీరోగా నటిస్తోన్న సినిమాకు, సి.వి.కుమార్ సినిమాకు, జ్యోతిక లీడ్ రోల్ లో నటిస్తోన్న మరో సినిమాకు మ్యూజిక్ చేయడానికి సైన్ చేశాను. అలానే తెలుగులో మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయని' తెలియజేశారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs