యశోజయ క్రియేషన్స్ బ్యానర్ పై సంజీవ్ నాయుడు హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'లవర్ బాయ్'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా..
సంజీవ్ నాయుడు మాట్లాడుతూ.. ''సమాజాన్ని ప్రేమించి, సేవ చేసే ప్రతి ఒక్కరు లవర్ బాయ్ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమాలో మొత్తం 5 పాటలుంటాయి. మంచి సంగీతం కుదిరింది. ఉదిత్ నారాయణ, శ్రేయాగోశల్ లాంటి పెద్ద పెద్ద సింగర్స్ ఈ సినిమా కోసం పని చేశారు. ఖచ్చితంగా సినిమా అందరికి నచ్చుతుంది'' అని చెప్పారు.
వినోద్ నువ్వుల మాట్లాడుతూ.. ''ఇప్పటివరకు టీవీలో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాను. 'లవర్ బాయ్' టైటిల్ లో నటించేది నువ్వే అని డైరెక్టర్ గారు చెప్పగానే చాలా సంతోషపడ్డాను. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమా మంచి విజయం సాధించి నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
విశ్వ మాట్లాడుతూ.. ''సంజీవ్ ఎంబిఏ చదివినా.. సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫ్లాప్ సినిమా నుండి కూడా మంచినే తీసుకుంటాడు. ఈ సినిమా తనకు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు
ఇంకా ఈ కార్యక్రమంలో సానియా చౌదరి, తమ్మిశెట్టి శ్రీనివాస్, ధూళిపాళ్ళ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.