Advertisement
Google Ads BL

'రాణి గారి బంగాళా' లోగో లాంచ్!


ఆనంద్ నందా, రేష్మి, శివకృష్ణ ప్రధాన పాత్రల్లో వి.సినీ స్టూడియో నిర్మాణంలో డి.దివాకర్ నిర్మిస్తోన్న చిత్రం 'రాణి గారి బంగాళా'. ఈ సినిమా లోగో లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకున్నాం కాని 'రాణి గారి బంగాళా' ను ఫైనల్ చేశాం. ఈ టైటిల్ తో సినిమాకు యాప్ట్ అవుతుందని భావించాం. 2015 డిశంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్ లో జనవరి 25నాటికి పూర్తి చేసేశాం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి మార్చి చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రభాకర్ గారి ఫోటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమాతో రేష్మి స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. ఆనంద్ కి ఇది మొదటి సినిమా అయినా చక్కగా నటించాడు. ఈ సినిమాలో శివకృష్ణ గారు కాటికాపరి పాత్రలో నటించారు. సినిమాకు ఆ పాత్ర చాలా కీలకం'' అని చెప్పారు.

శివకృష్ణ మాట్లాడుతూ.. ''జయం సినిమా తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లైన్ వినగానే ఈ అవకాశాన్ని ఎలా అయినా సద్వినియోగం చేసుకోవాలని నటించాను. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేశారు'' అని చెప్పారు.

ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే నమ్మకం కలిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బాలాజీ, వైజాగ్ ప్రసాద్, ప్రసన్న కుమార్, సాగర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకర్ రెడ్డి, ఎడిటర్: అనిల్ మలనాడు, స్టొరీ: వి.లీనా, సమర్పణ: బాలాజీ నాగలింగం, కో ప్రొడ్యూసర్: శ్రీనివాసరావు, నిర్మాతలు: వి.సినీ స్టూడియో, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డి.దివాకర్. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs