Advertisement
Google Ads BL

బాలకృష్ణ ఆవిష్కరించిన 'గుంటూర్ టాకీస్' ట్రైలర్!


నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలోరూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్‌విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్స్ ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''వైవిధ్యమైన చలన చిత్రాలను రూపొందించడంలో తెలుగు ఇండస్ట్రీ పెట్టింది పేరు. యువకులందరూ కలిసి చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా టైటిల్ హోమ్లీగా ఉంది. నేను ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న హిందూపూర్ లో ఈ సినిమా షూటింగ్ జరగడం సంతోషకరం. ఒక నటునిగా నాకు కూడా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. మంచి సస్పెన్స్ ఉంది. దర్శకుడు ప్రవీణ్ సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమాకు దొరికిన అతి కొద్దిమంది మంచి నటుల్లో నరేష్ ఒకడు. అతను ఈ సినిమాలో ఓ విభిన్నమైన పాత్రను పోషించడం నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. ''అగ్ర కథానాయకులైన బాలకృష్ణగారు మా సినిమా ట్రైలర్ లాంచ్ కు విచ్చేయడం మాకు కొత్త ఎనర్జీని ఇస్తోంది. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. ''ప్రవీణ్ సత్తారు గన్ లోనుంచి వస్తున్న మరో పవర్ ఫుల్ బుల్లెట్ 'గుంటూర్ టాకీస్'. అతను ఎప్పుడు ఎటువంటి సినిమాలు తెరకెక్కిస్తాడన్నది ఎవ్వరూ ఊహించలేరు. ఇది ఏ భాషలో తీసినా ఘన విజయం సొంతం చేసుకోగల సత్తా ఉన్న యూనివర్సల్ సబ్జెక్ట్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది'' అని అన్నారు. 

మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ''నా స్నేహితుడు సిద్ధు ఈ చిత్రంలో హీరోగా నటించడంతోపాటు రచయితగా కూడా క్రెడిట్ సంపాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. చంద‌మామ క‌థ‌లు స‌మ‌యంలోనే ఈ క‌థ విని చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. అంద‌రూ క‌ష్ట‌ప‌డి అనుకున్న‌ట్లు సినిమాను వ‌చ్చేలా చూసుకున్నారు'' అని అన్నారు. 

సిద్ధు మాట్లాడుతూ.. ''నా కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా 'గుంటూర్ టాకీస్' అనేది మాత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది'' అని అన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, నరేష్, శ్రద్ధాదాస్, రాజా రవీంద్ర, రఘుబాబు, రవిప్రకాష్, అపూర్వ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, ఎడిటర్: ధర్మేంద్ర, మ్యూజిక్: శ్రీ చరణ్ పాకల, నిర్మాత: రాజ్ కుమార్.ఎం., కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs