మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు త్వరలోనే ముహూర్తం ఖాయం చేసుకున్నారు. వి.వి.వినాయక్ దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరంజీవి 150 వ సినిమాకు మరో అడ్డంకి వచ్చి పడింది. 'కత్తి' కథ తనదేనంటూ రచయిత ఎన్.నరసింహారావు దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడెరేషన్ లో కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవికి, నిర్మాత రామ్ చరణ్ కు, డైరెక్టర్ వినాయక్ కు, పరుచూరి బ్రదర్స్ కు నోటీసులను పంపించారు. రచయితకు న్యాయం చేసిన తరువాతే సినిమా నిర్మాణం చేయాలని కథా హక్కుల వేదిక చైర్మన్ దాసరి నారాయణరావు తీర్మానించారు. తీర్మానాన్ని ఉల్లంఘించి నిర్మాణ బాధ్యతలు చేపడితే ఇండస్ట్రీ నుండి ఎటువంటి సహాయసహకారాలు అందవని తెలియజేశారు.